NewsOrbit
Featured న్యూస్ రివ్యూలు

Rang De Movie Review : ‘రంగ్ దే’ రివ్యూ 

Rang De Movie Review Nitiin keerthy suresh

Rang De Movie Review : నితిన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రంరంగ్ దే‘. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించారు. రాక్ స్టార్ డిఎస్పి సంగీతం అందించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం….

 

Rang De Movie Review Nitiin keerthy suresh
Rang De

Rang De Movie Review : కథకథనం

అర్జున్ (నితిన్), అను (కీర్తి) చిన్నప్పటినుండే ఒకరి ఇంటి పక్కన ఒకరు ఉండేవారు. వీరిద్దరికి చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి పడదు. ఎప్పుడూ తగాదాలు పెట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండేవారు. అయితే వీరిద్దరికీ అనుకోని పరిస్థితుల్లో అనూహ్యంగా వివాహం జరుగుతుంది. పెద్దలే బలవంతం చేసి మరి వీరిద్దరి పెళ్లి చేస్తారు. ఇందులో అను పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. మరి పెళ్లి అయిన తర్వాత అయినా వీరి మధ్య గొడవలు తొలుగుతాయా? అసలు వారిద్దరికీ ఎంత బలవంతంగా పెళ్లి చేయడానికి వెనుక కారణం ఏమిటి? అన్నదే సినిమా

ప్లస్ పాయింట్స్

  • నితిన్ కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్ లు చాలా బాగా చేశారు. నితిన్ ఇటువంటి రోల్స్ ఎప్పటినుండో ఈజ్ తో చేస్తున్నాడు. కీర్తి సురేష్ ఒక సినిమా మొత్తం ఇంత చలాకీగా కనిపించడం చాలా అరుదు. ఇక వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది.
  • సినిమాలో కొన్ని కామెడీ సీన్లు బాగా వర్కవుట్ అయ్యాయి. ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాయి.
  • డీఎస్పీ సంగీతం కూడా ఈ చిత్రానికి బాగా కుదిరింది. చాలా రోజుల తర్వాత ఇటువంటి ట్యూన్స్ ఇచ్చిన డిఎస్పి కొత్తదనం మిక్స్ చేసిన పాటలతో ప్రేక్షకులను బాగానే అలరించాడు
  • కథకు తగ్గట్టు సినిమాను మరీ లాగకుండా స్వీట్ అండ్ షార్ట్ గా ఉంది. నిడివి ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.

మైనస్ పాయింట్స్

  • రొటీన్ కథ కావడంతో సినిమాలో కొత్తదనం కావాలనుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం పూర్తిగా నిరుత్సాహపరుచువచ్చు.
  • సినిమాలో జరగబోయే సన్నివేశాలను చాలామంది ముందుగానే ఊహించే అవకాశం ఉంది. స్క్రీన్ ప్లే కూడా చాలా రొటీన్ గానార్మల్ గా ఉంది. పెద్దగా వైవిధ్యత లేదు.
  • ఒకానొక సమయంలో సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది. అసలే ఉన్న తక్కువ టైం లో ఇంత లాగింగ్ ను ప్రేక్షకులు భరించలేరు.
  • సినిమాలో అసలైన ఎమోషన్స్ కి ప్రేక్షకులు కనెక్ట్ కాలేని విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. మినిమమ్ ఎమోషనల్ కనెక్టివిటీ లేని టేకింగ్ కూడా పెద్ద మైనస్ పాయింట్. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డిఎస్పి రేంజ్ లో అయితే లేదు.

Rang De Movie Review : విశ్లేషణ

రంగ్ దేసినిమా మొదటి అర్ధ భాగం ఎంటర్టైనింగ్ గా పర్వాలేదనిపిస్తుంది. సినిమా రెండవ భాగం లోకి వెళ్లే ముందే ప్రేక్షకులకు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్న విషయం పై ఒక ఐడియా వస్తుంది. పైగా ట్రైలర్ లోనే వీరిద్దరికీ పెళ్లి జరుగుతుందని చెప్పేశారు. అయితే ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు అసలు లేవు. ఉన్న వాటిలో కూడా ఎమోషన్స్ మిస్ అయ్యాయి. ఇక అంతా ఊహించుకుంటూపోయి చివరికి జనాలు నీరసపడిపోతారు. మొత్తం మొదటి నుంచి చివరి దాకా ప్రేక్షకుల్లో ఆసక్తిని మెయింటైన్ చేయడంలో దర్శకుడు భారీగా విఫలమయ్యాడు. కొన్ని కామెడీ సీన్లు, అక్కడక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలనుకునేవాళ్ళు ఒకసారి భేషుగ్గా చూడవచ్చు.

చివరి మాట : ‘రాంగ్దే

Related posts

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?