NewsOrbit
Featured జాతీయం బిగ్ స్టోరీ

Uttarapradesh : ఊరికి ఉత్తరానా… పరిస్థితి మరేనా!!

Uttarapradesh : 75 జిల్లాలు, 403 అసెంబ్లీ సీట్లు, 80 లోక్ సభ సీట్లు, 21 కోట్ల జనాభా వినడానికి ఓ దేశం వివరాలు చెబుతున్నట్లుగా ఉన్నా, ఇది భారత దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ వివరాలు ఇవి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 312 సీట్లను గెలుచుకొని తిరుగులేని ఆధిక్యత తో అధికారంలోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది ఎన్నికల సంవత్సరం.

భారత దేశ రాజకీయాల ముఖచిత్రాన్ని పూర్తిగా తిప్పేయగల సామర్ధ్యం ఉన్న ఈ రాష్ట్రం అన్ని పార్టీలకు కీలకమే. 2019 లోక్సభ ఎన్నికల్లో 62 ఎంపీలను గెలుచుకున్నా, 9 సీట్లను కోల్పోయింది. మరి వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వానికి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి? ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అన్నది అన్ని రాజకీయ పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. అయితే నాలుగు సంవత్సరాల్లో ఉత్తరప్రదేశ్ పూర్తిగా మారిపోయింది అంటూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొన్ని ప్రకటనలు వివాదాస్పదం కావడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

Uttarapradesh
Uttarapradesh

ఉత్తరప్రదేశ్లో నేరాల శాతం ఎక్కువ. చిన్నచిన్న నేరాల నుంచి దేశాన్ని కుదిపేసిన అంత పెద్ద పెద్ద నేరాలు ఇక్కడ జరుగుతాయి. తమ ప్రభుత్వం వచ్చాక ఉత్తరప్రదేశ్లో నేరాలు తగ్గుముఖం పట్టాయనిk పోలీసింగ్ బాగా పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. అయితే 2017 లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరాలు తగ్గలేదు. 2017 లో పది శాతం, 2018 లో 10.35 శాతం నేరాలు పెరిగాయి. 2019లో మాత్రం నేరాల రేటు మూడు శాతం పెరుగుదల నమోదైంది. 2020లోను అది 3 శాతం కంటే తగ్గింది. తప్పితే నేరాలు తగ్గుదల ఎక్కడ లేదు. ఉత్తరప్రదేశ్లో 16 నుంచి 35 లోపు ఉన్న నేరస్ధుల సంఖ్య క్రమంగా పెరగడం గమనించలి.

ఉత్తరప్రదేశ్ లో మత ఘర్షణలు అధికం. కులాల గొడవలు కంటే, మతాల మధ్య ఆధిపత్య ధోరణి ఇక్కడ అధికం. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఇవి జరుగుతూనే ఉంటాయి. వెంటనే పోలీసులు స్పందించి వాటిని అదుపు చేయకపోతే మొత్తం విస్తరించి రాష్ట్రమంతా పాకే అవకాశం కూడా ఉంటుంది. యోగి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018 నుంచి ఈ అల్లర్లు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా, లెక్కల్లో మాత్రమే ఇవి తగ్గాయి అన్నది ప్రతిపక్షాల వాదన. క్షేత్రస్థాయిలో నిత్యం ఏదో ఒక మూల మత ఘర్షణలు సాగుతూనే ఉన్నాయని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. 2016లో 8016 మత ఘర్షణల కేసులు నమోదు కాగా, 2017 లో 8,990 కేసులు, 2018లో 8909 కేసులు నమోదు అయ్యాయి. 2019లో మాత్రం కేసులు గణనీయంగా తగ్గి 5714 నమోదు అయ్యాయి. గత ఏడాది ఇవి 5,300 మాత్రమే నమోదు అయ్యాయి.

ఉత్తరప్రదేశ్లో ప్రజల తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని, 2017 యోగి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది రెట్టింపు అయింది అన్నదిj ప్రభుత్వ మాట. 47,116 ల తలసరి ఆదాయం ప్రస్తుతం 94,495 వరకు పెరిగింది అన్నది, దీనికి బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక ఫలితాలే కారణం అని విశ్లేషిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఆ మాత్రం పెరగలేదు అని ఉత్తరప్రదేశ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్థిక విభాగం తెలుపుతోంది. 2018 కంటే కేవలం రెండు శాతం మాత్రమే తలసరి ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోందని, వాస్తవంగా ఉన్న లెక్కలు ఇవే అంటూ ప్రభుత్వం పేర్కొన్న అన్ని అంశాల మీద ఆధార సహితంగా ప్రతిపక్షాలు విరుచుకు పడుతున్నాయి. దీంతో నాలుగేళ్ల పాలనలో చాలా వరకూ చేశామని, ఉత్తర ప్రదేశ్ కి గత మార్చామని చెప్పుకుంటున్న బిజెపి ప్రభుత్వానికి వాస్తవ క్షేత్రస్థాయి పరిస్థితులు కాస్త ఇబ్బంది గా మారాయి. నాలుగేళ్ల సంబరాలలో ఇవి అడ్డంకులు సృష్టిస్తున్నాయి.

author avatar
Comrade CHE

Related posts

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju