NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

Lok sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన రాజకీయ పక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల హామీలు ఇస్తూ.. ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలతో వాగ్వివాదానికి దిగుతున్నారు.

తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ కు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మోడీ మనసులో కేవలం హిందూ – ముస్లిం ఉందని, మతం పేరుతో దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తమపై కామెంట్స్ చేసే ముందు .. వారి చరిత్ర ఏమిటో చూసుకోవాలని అన్నారు.

రీసెంట్ గా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ మేనిఫెస్టో పై సంచలన కామెంట్స్ చేశారు. వారి మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ సిద్ధాంతం ముద్ర ఉందని విమర్శించారు. దీనికి మల్లికార్జున ఖర్గే సమాధానమిస్తూ .. బీజేపీ నాయకులు ముందుగా తమ పార్టీ చరిత్ర చూసుకోవాలని అన్నారు. మతం పేరుతో వాళ్లే దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ప్రధాని మోడీ మనస్సులో కేవలం హిందూ – ముస్లిం మాత్రమే ఉందన్నారు. మతం పేరుతో దేశాన్ని విభజించడం, సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. తమ మేనిఫెస్టోను వాళ్లు (బీజేపీ) సరిగ్గా చదవలేదని అన్నారు. తాము యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పామని, మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పామనీ, రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) గ్యారెంటీ కల్పిస్తామని ఇవన్నీ ముస్లిం లీగ్ లో భాగమా అని ఖర్గే ప్రశ్నించారు.

రెండు టర్మ్ లుగా దేశంలో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎలాగైనా బీజేపీని గద్దె దించాలన్న లక్ష్యంతో విపక్ష పార్టీలతో ఇండియా కూటమిగా ఏర్పడింది. తమ మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చింది.

వీటిలో ఎంఎస్పీకి చట్టపరమైన హామీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయడం, వచ్చే పదేళ్లలో జీడీపీని రెట్టింపు చేయడం, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేయడం, చైనాతో యథాతథ స్థితిని పునరుద్దరించడం లాంటి అనేక హామీలు ఉన్నాయి. అంతే కాకుండా 9 నుండి 12వ తరగతి విద్యార్ధులకు మొబైల్ ఫోన్ లు ఇవ్వడంతో పాటు జీఎస్టీని సవరిస్తామని ఆ పార్టీ వాగ్దానం చేసింది.

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?