Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఇండస్ట్రీలో ఇతనికి ఉన్న మాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు మూడు సంవత్సరాల విరామం తర్వాత వకీల్ సాబ్ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా విడుదలైనప్పటినుంచి బాక్సాఫీసు దగ్గర భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా 100 కోట్ల షేర్ రీచ్ కాలేకపోయింది.
ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. కానీ టాలీవుడ్ మార్కెట్ 100 కోట్లు దాటే సమయానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో తను నటించిన ఏ ఒక్క సినిమా కూడా 100 కోట్ల షేర్ రీచ్ కాలేకపోయింది. అయితే పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమా టార్గెట్ రీచ్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న “పింక్” చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన “వకీల్ సాబ్” సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు పోటీగా ఏ సినిమా నిలవలేదని చెప్పవచ్చు.
వకీల్ సాబ్ 100 కోట్ల షేర్:
వకీల్ సాబ్ సినిమా విడుదలైనప్పటి నుంచి భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది.ఈ క్రమంలో ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులు 100 కోట్ల షేర్ రీచ్ అవుతుందని భావించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు దూకుడుకు కరోనా బ్రేకులు వేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో థియేటర్లకు జనాలు రావడం పూర్తిగా తగ్గిపోయింది. కేసులు పెరుగుతున్న క్రమంలోనే వకీల్ సాబ్ సినిమా వీకెండ్ కలెక్షన్స్ 100 కోట్ల షేర్స్ సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమా అభిమానుల కోరిక నెరవేరుస్తుందా? 100 కోట్ల షేర్ టార్గెట్ రీచ్ అయ్యి అభిమానుల కోరిక తీరుస్తుందా? అనే విషయంపై పూర్తి క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!