NewsOrbit
న్యూస్

TDP YSRCP: అధికార పార్టీకి టీడీపీ కౌంటర్ అటాక్..! మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు..! పోలీసులు ఏమి చేస్తారో మరి..?

TDP YSRCP: రాష్ట్రంలో కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతం అవుతున్న వేళ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల  మాటలు యుద్దంతో పాటు పోలీస్ కేసుల వరకూ వెళుతోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుపై కర్నూలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కర్నూల్ జిల్లా కేంద్రంగా ఎన్ 440 కే కరోనా వేరియంట్ ఉన్నట్లు చంద్రబాబు అసత్య ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్న అభియోగంపై ఓ న్యాయవాది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ రోజు చంద్రబాబుకు నోటీసులు కూడా అందించారు. చంద్రబాబుపై కేసు నమోదు చేయడంపై ఆ పార్టీ నాయకులు అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

TDP YSRCP file complaints each other
TDP YSRCP file complaints each other

సాధారణంగా గ్రామాల్లో, పట్టణాల్లో బాధితుడు పోలీసులకు  ఫిర్యాదు చేసిన వెంటనే నిందితుల తాలూకు వాళ్లు కౌంటర్ కేసులు పెట్టడం, కేసు, కౌంటర్ కేసులు నమోదు చేయడంతో ఆయా కేసులలోని నిందితులు కేసులు రాజీ చేసుకోవడం జరుగుతుంటోంది. ఇప్పుడు అదే మాదిరిగా చంద్రబాబుపై కేసు నమోదుకు కౌంటర్ గా అదే ఆరోపణపై టీడీపీ శ్రేణులు ఓ మంత్రిపై పోలీసు స్టేషన్ లో ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.

మంత్రి సీదిరి అప్పలరాజుపై కర్నూలు ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేతలు రవికుమార్, థరూర్ జేమ్స్ ఫిర్యాదు చేశారు.    కర్నూలులో ఎన్ 440 కే వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందనీ, అది చాలా ప్రమాదకరమైనదని కూడా ఓ చర్చా కార్యక్రమంలో మంత్రి అప్పలరాజు పేర్కొన్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యల పట్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారనీ, కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు ఇంత వరకూ మంత్రి పై కేసు నమోదు చేయలేదు.

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?