NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Tirupathi RUIA: ఎందుకీ సెక్రెట్లు – మరణం వెనుక మర్మం..!? 11 – 45 – 56..!?

Tirupathi RUIA: తిరుపతి రూయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా బాధితులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన పై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మద్య విమర్శలు, ప్రతి విమర్శలకు దారి తీస్తున్నది. రూయా ఆసుపత్రిలో మృతుల సంఖ్య చాలా ఎక్కువేననీ, కానీ ప్రభుత్వం వాస్తవ విషయాలను కప్పిపెడతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రూయాలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు వెళ్లిన నేతలను పోలీసులు అడ్డుకోవడం, గృహ నిర్బంధాలు చేశారని టీడీపీ, సీపీఐ  నాయకులు మండిపడుతున్నారు.

Tirupathi RUIA covid deaths secrets
Tirupathi RUIA covid deaths secrets

ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందారని చెబుతున్న అధికారులు ఆ మృతుల వివరాలను కూడా ఇంత వరకూ వెల్లడించలేదని అంటున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ దుర్ఘనను ప్రతిపక్షాలు ప్రభుత్వానికి ఆపాదించి బుదరచల్లే ప్రయత్నం చేస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది. చిత్తూరు జిల్లా కలెక్టర్ ఘటన జరిగిన సోమవారం రాత్రి ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందారని అధికారికంగా వెల్లడించారు. అయితే సోమవారం జరిగిన సాధారణ మరణాలను కూడా ఆక్సిజన్ అందక మృతి చెందారని టీడీపీ వారు ఆరోపిస్తున్నాయని వైసీపీ మండిపడుతోంది.

Tirupathi RUIA covid deaths secrets
Tirupathi RUIA covid deaths secrets

Tirupathi RUIA: మరణాలపై గందరగోళం

కోవిడ్ మరణాలపై అధికారులే గందగోళానికి కారణం అవుతున్నారు. సోమవారం నాడు రూయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 45 మంది మృతి చెందినట్లు ఆ ఆసుపత్రి సూపర్నిటెండెంట్ ఓ జాబితా విడుదల చేశారు. అయితే అధికారులు మాత్రం ఆక్సిజన్ అందక మృతి చెందిన 11 మంది బాధితుల పేర్లు వెల్లడించలేదు. ప్రభుత్వం మాత్రం మృతి చెందిన ఆ 11 మందికి పది లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

Tirupathi RUIA covid deaths secrets
Tirupathi RUIA covid deaths secrets

మరో పక్క ఒక్క రూయా ఆసుపత్రిలోనే 45 మంది మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతుండగా ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ లో చిత్తూరు జిల్లాలో 24 గంటల వ్యవధిలో 18 మంది కరోనా బాధితులు మృతి చెందినట్లు పేర్కొనడంతో ప్రభుత్వం మరణాల లెక్కను దాస్తుందన్న ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవ లెక్కలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి జాబితాను అధికారికంగా ప్రకటించి ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని  బాధిత కుటుంబాలకు అందజేసి విమర్శలకు తావు రాకుండా చూసుకోవాలి.

Related posts

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?