Balakrishna: టాలీవుడ్ నటసింహం బాలయ్య బాబు ప్రస్తుతం ఫుల్ ఫ్లాపుల్లో ఉన్నారు. “లెజెండ్” సినిమా తర్వాత ఆ స్థాయిలో పెద్దగా హిట్ పడలేదు. ముఖ్యంగా తన తండ్రి బయోపిక్ సినిమాలు రెండూ కూడా బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడటంతో .. ప్రస్తుతం వస్తున్న బోయపాటి “అఖండ” సినిమా పై నందమూరి అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. గతంలో బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన..సింహ, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. దీంతో అఖండ సినిమా హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలయ్య బాబు హిట్ ట్రాక్ లో పడాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత టాప్ డైరెక్టర్ గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ నేపథ్యంలో కమర్షియల్ ఎలిమెంట్ తరహాలో బాలయ్య బాబు కోసం ఓ డిఫరెంట్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు ఇప్పటికే ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోపీచంద్ మలినేని తాను ఇప్పటి వరకు చేసిన సినిమాలలో బ్లాక్ బస్టర్ అయిన వాటిలో హీరోయిన్ పాత్రలో శృతి హాసన్ ఉండటంతో ఇప్పుడు అదే సెంటిమెంట్ బాలయ్య కోసం రిపీట్ చేయాలని డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.
దీంతో బాలయ్య బాబు సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని తీసుకున్నట్లు .. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇండస్ట్రీలో గోపీచంద్ మలినేని వరుస విజయాల మీద ఉన్నాడు. వరస ఫ్లాపుల్లో ఉన్న రవితేజకి “క్రాక్” సినిమాతో అదిరిపోయే హిట్ అందించాడు. దీంతో బాలయ్య కి ఏ తరహా హిట్ అందిస్తాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.