Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “బాహుబలి” తో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయిన తర్వాత సినిమాలు ఎంపిక విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. “బాహుబలి”తో దేశవ్యాప్తంగా మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావడంతో.. ఇతర ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లకు పాన్ ఇండియా స్క్రిప్ట్ వినిపించే వారికి ఛాన్స్ అందిస్తూ వస్తున్నారు. ఈ తరహా ఫార్ములా తోనే “కేజిఎఫ్” లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుని దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి ఛాన్స్ ఇచ్చి, ఆయన డైరెక్షన్ లో ప్రస్తుతం ప్రభాస్ “సలార్” సినిమా స్టార్ట్ చేయడం జరిగింది.
ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ విషయంలో చకచకా వ్యవహారం నడుపుతూ కంప్లీట్ చేసే తరహాలో ప్రభాస్ ఉన్నాడు. “సలార్” భారీ హై ఓల్టేజ్ మాస్ స్క్రిప్ట్ అని ఇప్పటికే ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ డబల్ క్యారెక్టర్ అని కూడా టాక్. మాఫియా నేపథ్యంలో సినిమా ఉంటుందని వార్తలు వస్తుండగా ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ లైన్లో పెట్టినట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Read More: Men: శృంగార సామర్ధ్యం కోసం పురుషులు ఈ మాత్రలను వాడితే ఇక తిరుగుండదు!!
మేటర్ లోకి వెళితే ఈ సినిమాకి ప్రభాస్ బాడీ కి తగ్గ రీతిలో అదే స్థాయిలో ఉండే విధంగా విలన్ పాత్ర కి జాన్ అబ్రహం ని సెలెక్ట్ చేయడం జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇటీవలే ఆయన స్టోరీ విని నట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది అన్ని సినిమా యూనిట్ నుండి అందుతున్న టాక్.