NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

Stalin: స్టాలిన్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు… మాన‌వ‌త్వ‌మా… రాజ‌కీయ‌మా?

Stalin:  అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ త‌మిళ‌నాడులో జ‌రిగిన ఎన్నిక‌ల్లో డీఎంకేను ఒంటి చేత్తో భారీ ఆధిక్యంతో గెలిపించి సీఎం పీఠం అధిరోహించిన ఎంకే స్టాలిన్ ప‌రిపాల‌న‌లో త‌న ముద్ర వేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అమ్మ క్యాంటీన్ల‌లో జ‌య‌ల‌లిత బొమ్మ కొన‌సాగింపు మొద‌లుకొని క‌రోనా క‌ల్లోలాన్ని చ‌క్క‌దిద్దేందుకు విప‌క్ష నేత‌ల‌తో క‌లిసి క‌మిటీ వేయ‌డం వ‌ర‌కూ స్టాలిన్ నిర్ణ‌యాలు సంచ‌ల‌నంగా మారుతున్నాయి. తాజాగా క‌రోనాతో అనాథ‌లైన పిల్ల‌ల కోసం సీఎం స్టాలిన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే , దీనిపై వివిధ ర‌కాల కామెంట్లు వ‌స్తున్నాయి

Read More : Harish Rao: హ‌రీశ్ రావు ఆరోగ్య మంత్రి అయిపోయిన‌ట్లేనా?

క‌రోనా బాధిత చిన్నారుల‌కు భారీ తీపిక‌బురు

క‌రోనా తో త‌మ‌ త‌ల్లిదండ్రులు, సంర‌క్ష‌ల‌‌ను కోల్పోయి అనాథ‌లైన చిన్నారుల‌ను ఆదుకోవ‌డానికి త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.5 ల‌క్ష‌ల చొప్పున‌ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయ‌నున్న‌ట్టు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. స‌ద‌రు పిల్ల‌ల‌కు 18 ఏళ్లు నిండిన త‌ర్వాత ఈ మొత్తాన్ని వడ్డీతో స‌హా అందించే విధంగా ఏర్పాట్లు చేస్తామ‌ని ఎంకే స్టాలిన్ తెలిపారు. ఈ చిన్నారుల విద్యకు సంబంధించి స్కూల్‌, కాలేజ్, గ్రాడ్యుయేషన్ వరకు విద్యా , వసతి ఖర్చులను కూడా ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని సీఎం స్టాలిన్ ప్ర‌క‌టించారు. ఆ చిన్నారుల‌కు 18 ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కు ప్ర‌తి నెల‌ రూ.3 వేలు భ‌త్యం రూపంలో ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. కోవిడ్‌తో అనాథ‌లైన చిన్నారుల‌ను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ఎంకే స్టాలిన్ చెప్పారు.

Read More : Lock down: గుడ్ న్యూస్ః ప‌క్క రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తేస్తున్నారు

స్టాలిన్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు…
త‌మిళ‌నాడు ఎన్నికల స‌మ‌యంలో 500 లకు పైగా హామీలతో కూడిన మ్యానిఫెస్టోను డీఎంకే పార్టీ రూపొందించింది. ఆ భారీ హామీల్లో ముఖ్యమైనవి ముందుగా అమలు చేసేందుకు కొత్త‌గా కొలువుదీరిన‌ స్టాలిన్ ప్రభుత్వం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన తరువాత స్టాలిన్ మూడు ద‌స్త్రాల‌పై సంతకాలు చేశారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం, రేషన్ కార్డులు క‌లిగిన‌ 2.07 కోట్ల కుటుంబాలకు రూ.4వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించే ఫైల్ మ‌రొక‌టి. వీటితో పాటుగా రాష్ట్రంలో లీటర్ పాలపై రూ.3 తగ్గింపుకు సంబంధించిన ఫైల్ పై కూడా స్టాలిన్ సంతకం చేశారు. ఇలా సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో స్టాలిన్ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju