lips: ముఖం కాంతివంతం గా అందంగా, పెదవులు నల్లగా ఉంటే అస్సలుఅందంగా అనిపించదు.ఈ ఆలోచనతోనే చాలామంది పెదవుల నలుపును వదిలించుకోవడానికి రకరకాలు ప్రయోగాలుచేస్తుంటారు. కానీ ఫలితం మాత్రం పొందలేరు.అంతటితో ఆగకుండా పెదవుల కోసం ఖరీదైన కాస్మొటిక్స్ కొనుగోలు చేస్తున్నారు.అయినా అనుకున్న మార్పు రాకపోగా కొన్ని దుష్ప్రభావాలు కలుగుతున్నాయి.
అయితే కొన్ని తేలికగా ఉండే సహజమైన చిట్కాలు ఫలితం దక్కే వరకు వదలకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా పెదవుల నలుపు తగ్గి ఎర్రగా గులాబీ రేకుల్లా ఉంటాయి. నలుపును తొలగించటంలో దాల్చిన చెక్క పొడి బాగా పని చేస్తుంది.ఈ పొడిలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్,మినరల్స్, ఉండటం వలన పెదాల నలుపు ను తేలికగా తగ్గించేస్తుంది బేకింగ్ సోడా లో బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి కాబట్టి పెదాల నలుపు ను పోగొట్టడం లో బాగా పనిచేస్తుంది.
కొబ్బరినూనె మాయిశ్చరైజర్ లక్షణాలు కలిగి ఉండటం వలన పెదాలు పొడిగా మా రానివ్వకుండా తేమగా ఉండేలా చేస్తాయి.
కాబట్టి ఈ మూడింటిని పెదవుల రంగు కోసం ఎలా వాడాలో తెలుసుకుందాం.
ఒక చిన్న గిన్నెలో అర స్పూన్ కొబ్బరి నూనె, పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి, పావు స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలిపి పెదాలకు పట్టించి 3 నిమిషాలు నెమ్మదిగా ,సున్నితంగా మసాజ్ చేసి ఆరిన తర్వాత చల్లని నీటిని వాడి శుభ్రం చేసుకోవాలి. వారంలో నాలుగు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే, నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారతాయి. రాత్రి నిద్రపోయే ముందు కలబంద గుజ్జును తీసుకుని పెదాలపై రాసుకుని పడుకోవాలి.ఇలా ప్రతి రోజు రాత్రి చేస్తే,ఖచ్చితంగా పెదాల నలుపు పోయి ఎర్రగా, అందంగా తయారవుతాయి.ఈ చిట్కాలు బాగా పని చేస్తాయి. కాబట్టి పట్టు వదలకుండా ఫలితం దక్కే వరకు చేస్తూనే ఉండండి.