NewsOrbit
జాతీయం న్యూస్

CBI: సీబీఐ నూతన బాస్ కొత్త రూల్స్..! సిబ్బందికి ఊహించని ట్విస్ట్ ఇదీ..!!

CBI: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్త బాస్ గా ఇటీవలే సుబోధ్ కుమార్ జైశ్వాల్ బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. సహజంగా ఏ శాఖలోనైనా నూతన బాస్ వచ్చిన తరువాత కొందరు అధికారులు వారి మార్క్ చూపించేందుకు కొన్ని కొన్ని సంస్కరణలు చేస్తుంటారు. వాటిని వారి హయాంలో అమలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఫలానా అధికారి హయాంలో ఇలా, అలా అంటూ ఆ శాఖలోని సిబ్బంది తరువాత దానిపై చర్చించుకుంటుంటారు. ఆ అధికారి మార్క్ ఆ శాఖలో గుర్తుండి పోతుంది. అదే తరహాలో సీబీఐ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన సుబోధ్ కుమార్ జైశ్వాల్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే సీఐబీ సిబ్బంది విషయంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు చూసి సిబ్బంది ఒక్క సారిగా షాక్ అయ్యారు. అది ఏమిటంటే..

CBI new boss new rules
CBI new boss new rules

సీబీఐ లో పని చేసే సిబ్బంది, అధికారులు అందరూ ఫార్మల్ దుస్తులనే ధరించాలి. ముఖ్యంగా జీన్స్, టీ షర్టులు, స్పోర్ట్స్ షూస్ ధరించకూడదు. క్యాజువల్ దుస్తులతో నీట్ గా విధులకు హజరుకావాలి. సుబోధ్ కుమార్ జైశ్వాల్ ఉత్తర్వుల మేరకు ఇక పై దేశ వ్యాప్తంగా సీబీఐ ఆఫీసుల్లో అధికారులు, ఉద్యోగులు ఫార్మల్ దుస్తులనే ధరించాల్సి ఉంటుంది. పురుషులు చొక్కాలు, ఫార్మల్ ప్యాంట్, షూస్ మాత్రమే ధరించాలి. ఆఫీసుకు శుభ్రంగా షేవింగ్ చేసుకుని హజరుకావాల్సి ఉంటుంది. ఇక మహిళా అధికారులు, సిబ్బంది చీరలు లేదా సూట్స్, చొక్కాలు, ఫార్మల్స్ ధరించవచ్చు. కానీ జీన్స్, టీ షర్టులు, స్పోర్ట్స్ షూస్, చెప్పులు, క్యాజువల్ వియర్ ధరించకూడదు.

Read More: AP IAS Transfers: ఏపిలో భారీ ఎత్తున ఐఏఎస్‌ అధికారుల బదిలీలు…వివరాలు ఇవీ..

ఈ వివరాలను ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఆదేశాలను కశ్చితంగా పాటించాల్సి ఉంటుందనీ, లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు. కార్యాలయాల్లో సరైన స్థితిని ఉంచేందుకే ఇలా అధికారులు, సిబ్బంది వస్త్రధారణపై ఆదేశాలు జారీ చేసి ఉంటారని సీబీఐకి చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. అయితే వచ్చీ రాగానే అధికారులు, సిబ్బంది వస్త్రధారణపై ఆదేశాలు జారీ చేయడం ఆ శాఖలో చర్చనీయాంశమవుతోంది. ముందు ముందు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

Related posts

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju