NewsOrbit
జాతీయం న్యూస్

Abhishek Banerjee: మేనల్లుడికి మెగా పోస్ట్ ఇచ్చిన మమతా బెనర్జీ !తృణమూల్ కాంగ్రెస్ లో కీలక రాజకీయ పరిణామం!

Abhishek Banerjee: మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీలో ప్రమోషన్ ఇచ్చారు.ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అభిషేక్ బెనర్జీని ఆమె ప్రమోట్ చేశారు.శనివారం జరిగిన పార్టీ ఉన్నతస్థాయి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటివరకు తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న అభిషేక్ బెనర్జీ కి ఇది ఊహించనంత పదోన్నతి.

Mamata Banerjee gives mega post to her nephew Abhishek Banerjee!
Mamata Banerjee gives mega post to her nephew Abhishek Banerjee!

Abhishek Banerjee: మొన్నటి ఎన్నికల్లో కీలక పాత్ర!

బీజేపీతో చావో రేవో అన్నట్లుగా సాగిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలుపు కోసం సర్వశక్తులు ధారపోసిన వారిలో మమతాబెనర్జీ తర్వాతి స్థానంఅభిషేక్ బెనర్జీ దే! డైమండ్ హార్బర్ ఎంపీగా ఉన్న ఈ ముప్పయి ఐదేళ్ల యువకుడు మేనత్తకు అన్ని విషయాల్లో పూర్తి అండగా నిలబడ్డాడు.పార్టీలో క్రమంగా అభిషేక్ బెనర్జీ ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలోనే సువే౦దు అధికారి వంటి ట్రస్టెడ్ లెఫ్టినెంట్ కూడా మమతా బెనర్జీని వీడి బిజెపి లోకి వెళ్లిపోయారు.అయినా సుభేందు అధికారిని బెనర్జీ వదిలిపెట్టలేదు. అక్రమంగా ఆర్జించిన సంపాదనలో కాపాడుకోవడానికే సుభేందు బిజెపి పంచన చేరారని,తృణమూల్ కాంగ్రెస్ లో ఉంటూనే బిజెపికి కోవర్టుగా పని చేశారని అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు.

Read More: ys jagan: జగన్ ఇమేజ్ ని ఎవరెస్టు రేంజ్ కి చేర్చిన ఉదారత!ఇది ఆషామాషీ సాయంకాదు!హ్యాట్సాఫ్ సీఎం గారూ!!

ప్రధాని ,హోం మంత్రులకు కూడా టార్గెట్ గా మారిన అభిషేక్!

ఇలా అభిషేక్ బెనర్జీ బీజేపీని వెంటాడుతూ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పై కమలనాథులు చేస్తున్న ప్రచారానికి ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం తో ప్రధాని నరేంద్ర మోడీ,హోం మంత్రి అమిత్ షా లకి కూడా అభిషేక్ బెనర్జీ టార్గెట్ అయ్యారు.ఒక బహిరంగ సభలో అగ్ర నేతలిద్దరు అభిషేక్ బెనర్జీని ఉద్దేశించి “దోపిడీదారుడైన ఓ మేనల్లుడు” అంటూ కామెంట్లు విసిరారు.అయితే వారికి కూడా అభిషేక్ కౌంటర్ ఇచ్చారు.ఒకవేళ నేనే తప్పు చేసినా. అవినీతికి పాల్పడినా రుజువు చేసి తనను జైలుకు పంపించుకోవచ్చునని వారిని సవాల్ చేశారు.మొత్తంగా చూస్తే అభిషేక్ బెనర్జీ దీక్షాదక్షతలను పరిగణనలోకి తీసుకుని ఆయన విధేయతను అంచనా వేసుకుని మమతా బెనర్జీ పార్టీ టాప్ చైర్ లో మేనల్లుడిని కూర్చోబెట్టినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju