NewsOrbit
న్యూస్ హెల్త్

ice cream: బ్రేక్‌ఫాస్ట్ లాగా ఐస్‌క్రీం  తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి!!

ice cream: అమృతం ఎలా  ఉంటుందో మాకు తెలియదు కానీ మా ఉద్దేశం లో మాత్రం  ఐస్‌క్రీమ్ ని అమృతం అనవచ్చు అంటున్నారు అనేక మంది.రకరకాల కారణాలతో  కొందరు దీనికి దూరంగా ఉంటూ పిల్లల్ని కూడా ఉంచుతారు.  ఇవన్నీ   అర్థంలేని భయాలే అని తెలియచేస్తున్నారు  బ్యూటీ నిపుణులు. అయితే  ఐస్‌క్రీమ్ ని  బయట కొనుక్కునే కన్నా ఇంటిలో తయారు చేసుకుని తినటం మంచిది.

చాలామందికి ఐస్‌క్రీమ్ రాత్రి పూట తినటం సరదాగా ఉంటుంది . కానీ అప్పుడు తినటం  మంచిది కాదు. అందులో చక్కెర శాతం మోతాదు మించి ఉండటం వలన  నిద్ర రాకుండా చేస్తుంది. అధిక చక్కెర, జీర్ణం అవడానికి ఎక్కువ సమయం  పడుతుంది. ఈ కారణంగా  నిద్రకు ఇబ్బంది  ఏర్పడుతుంది. ఇంకొంత మంది ఫంక్షన్ లకు లేదా పార్టీలకు  వెళ్ళినప్పుడు  ఆహారం కొంచెం ఎక్కువగా తింటుంటారు. ఇక  రుచికరమైన విందుఅయ్యాక చల్లటి ఐస్‌క్రీమ్‌  తింటూ ఉంటారు. అయితే భోజనం చేసిన వెంటనే కూడా  ఐస్‌క్రీమ్‌ తినవద్దు అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆహారం తిన్న వెంటనే    ఐస్‌క్రీమ్‌ తింటే జీర్ణాగ్ని చల్లారిపోయి జీర్ణక్రియ దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. అయితే  ఐస్‌క్రీం మీద జరిగిన ఒక పరిశోధనలో ఎలాంటి విషయాలు బయటపడ్డాయో తెలుసుకుందాం.

ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లాగా ఐస్‌క్రీం  తింటే రోజంతా చురుకుగా ఉండవచ్చు అన్న విషయం పరిశోధనలో తేలింది.ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉండవచ్చు.   కానీ ఇది సుమారు రెండు వేల మందిపై పరిశోధన చేసి చెప్పారు . వీరిని రెండు గ్రూపులుగా  చేసి ఒక గ్రూపు వారికి ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లా తినటానికి  ఐస్‌క్రీమ్ ఇచ్చారు. మరో గ్రూపు వారికి వారు రోజూ తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ను మాత్రమే  ఇచ్చారు. తర్వాత  వారికి కొన్ని పజిల్స్ ఇచ్చి పూర్తి చేయమని చెప్పారు.

ఐస్‌క్రీమ్ తిన్న గ్రూపులో 60% నుండి 70% శాతం మంది చాలా త్వరగా, తేలికగా పజిల్‌ను పూర్తిచేయగా, రెండోగ్రూపు వారు దాన్ని పూర్తి చేయడానికి చాలా ఎక్కువ సమయం పట్టింది . వారి మధ్య ఈ తేడాకు  కారణం బ్రేక్‌ఫాస్ట్ కింద ఐస్‌క్రీమ్ తీసుకోవడమే అని పరిశోధకులు తెలియచేస్తున్నారు. అయితే ఈ విషయం మీద మరిన్ని పరిశోధనలు చేయాల్సి  ఉందని తెలిపారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N