NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Police: చట్టం ఎవరికీ ఎలా..!? పోలీసులు ఏం చేస్తున్నట్టు..!?

police must enforce the rules

AP Police: ఏపీ పోలిస్ AP Police ఎక్కడైనా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కానీ.. అదే చట్టం ఒక్కోసారి విమర్శలు కొని తెచ్చుకుంటుంది. దేశంలో ప్రస్తుతం కోవిడ్ గుప్పిట్లో ఉంది. కొన్ని మినహాయింపులు, పరిమితులు మినహా రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తున్నాయి. ఏ రాష్ట్రంలో కూడా పోలీసులు అలక్ష్యానికి తావివ్వకుండా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే.. అక్కడక్కడా ప్రజలు, కొందరు రాజకీయ నేతలు.. ఇందుకు విరుద్ధంగానే వ్యవహరిస్తున్నారు. ఏపీనే తీసుకుంటే ఈతరహా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు నిబంధనలు పాటించకపోతే జరిమానా విధించమని ఆదేశించే పాలకులు మాత్రం అవే నిబంధనలు పాటించడం తక్కువ. నిన్నటి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన మంత్రులు.. తదితరులను చూస్తే ఇదే అర్ధమవుతుంది.

police must enforce the rules
police must enforce the rules

ఈనెల 8న.. మంగళవారం జగనన్న తోడు పథకాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ ఆదిత్యనాధ్ దాస్, ఉన్నతాధికారులు శ్రీలక్ష్మి, అజయ్ జైన్, గోపాలకృష్ణ ద్వివేది, లబ్దిదారులు కొందరు, తదితరులు పాల్గొన్నారు. అయితే.. సీఎం, మంత్రి, ఉన్నతాధికారుల్లో కొందరు మాస్కులు ధరించలేదు. మాస్కులు ఉన్నా నోటి కింది భాగం వరకూ ధరించారు. ఫొటో కోసం మాస్కులు కిందికి దించారని అనుకున్నా.. అసలు మాస్కులు లేనివారు ఉండటమే విమర్శలకు కేంద్రంగా మారింది. వ్యాక్సిన్ తీసుకున్నా జాగ్రత్తలు తప్పినిసరిని ప్రభుత్వాలు, వైద్య వర్గాలు, నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితిల్లో సామాన్యులు కూడా దాదాపు మాస్కులు ధరించే ఉంటున్నారు.

Read More: Corona Virus: 66 రోజుల తర్వాత.. దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు..!

కానీ.. అందరికీ మార్గదర్శిగా ఉండాల్సిన ప్రభుత్వ పెద్దలు మాత్రం మాస్కులు ధరించలేదు. పైగా.. ప్రతిపక్ష నాయకులు మాత్రం ఇలా చేస్తే పోలీసులు కేసులు పెడుతున్నారు. స్థానికంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా వైసీపీ నేతలు మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం తక్కువ. వారి విషయంలో చోద్యం చూసే పోలీసులు ప్రతిపక్ష నాయకులపై మాత్రం రూల్స్ ప్రయోగిస్తున్నారు. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కోవడ్ రూల్స్ పాటిస్తూ సంగం పాలకమండలి సమావేశం 12 మందితో నిర్వహించారు. అయితే.. 15మందికి పైగా ఉన్నారంటూ కేసు నమోదు చేశారు. ఎవరు అధికారంలో ఉంటే వారికి పోలీసులు అనుకూలంగా ఉండటం సహజమే. అయితే.. పాలకులు మాత్రం అందరికీ ఆదర్శంగా ఉండాల్సిందే.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju