NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

TMC Leader Mukul Roy: జడ్ కేటగిరి భద్రత ఉపసంహరించాలంటూ కేంద్రానికి లేఖ రాసిన టీఎంసీ నేత..!!

TMC Leader Mukul Roy: సహజంగా రాజకీయాలలో పెద్ద స్థాయి నాయకులు వ్యక్తిగత భద్రత కావాలని కోరుకుంటారు. కేంద్ర ప్రభుత్వ నాయకులకు ఇవ్వడమే కష్టం. ఇస్తే దాన్ని ఒదులుకోరు. పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, యుపి తదితర రాష్ట్రాల్లో నాయకులకు ప్రత్యర్థుల నుండి త్రెట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు వ్యక్తిగత భద్రత కోరుకుంటారు. నాయకులకు  నలుగురు అయిదుగురు గన్ మెన్ ల భద్రత ఉంటే ఆ హోదా, దర్పం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వై, జడ్ కేటగిరి భద్రత అంటే ఆ నాయకుడు చాలా పాపులర్ కింద లెక్కే. ఇటువంటి తరుణంలో ఓ నాయకుడు తనకు కేంద్రం కల్పించిన జెడ్ కేటగిరి భద్రత వెనక్కుతీసుకోండి అని లేఖ రాయడం విశేషమే కదా. అలా ఎవరు లేఖ రాశారు. ఎందుకు రాశారు అనేది ఇప్పుడు చూద్దాం.

TMC Leader Mukul Roy writes to mha for withdrawal of central security
TMC Leader Mukul Roy writes to mha for withdrawal of central security

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేత ముకుల్ రాయ్ కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) కేటాయించిన జడ్ కేటగిరి భద్రత వెనక్కు తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాశారు. అయితే దీనిపై హోంశాఖ ఇంకా స్పందించలేదు. మార్చి నెలలో కేంద్రం ఆయన భద్రతను వై ప్లస్ నుండి జడ్ కేటగిరికి పెంచింది. టీఎంసీ పార్టీ ఆవిర్భావం నుండి మమత బెనర్జీతో ఉన్న ముకుల్ రాయ్ తన తనయుడుతో కలిసి 2017లో బీజేపీలో చేరారు. బీజేపీ ఆయనకు పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ మూడవ సారీ ఘన విజయం సాధించడంతో ముకుల్ రాయ్ రెండు రోజుల క్రితం సొంత గూటికి వచ్చేశారు.

Read More: Viral News: ఉద్యోగం ఇప్పిస్తానని కమిట్మెంట్ అడిగారు.. అధికారిపై యువతి సంచలన ఆరోపణలు..!! పార్ట్ -1

శుక్రవారం టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ సమక్షంలో పార్టీలో చేరారు. ఇదే సందర్భంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ రానున్న రోజుల్లో బీజేపీలో చేరిన నేతలు పలువురు సొంత గూటికి చేరుకుంటారని పేర్కొన్నారు. టీఎంసీలో చేరిన మరుసటి రోజే ముకల్ రాయ్ కేంద్రానికి తన భద్రతను వెనక్కు తీసుకోవాలంటూ లేఖ రాయడం గమనార్హం.

అసలే టీఎంసీ, కేంద్రంలోని బీజేపీకి పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో టీఎంసీ నేతలకు కేంద్ర భద్రత ఉంటే పూర్తిగా వీరిపై కేంద్ర నిఘా ఉన్నట్టే భావించాల్సి ఉంటుంది. అధికార టీఎంసీలో చేరడంతో రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం భద్రత కల్పిస్తుంది. ఈ కారణాల వల్ల ముకుల్ రాయ్ కేంద్రానికి ఈ విధంగా లేఖ రాశారని భావిస్తున్నారు.

Related posts

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju