NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

10th, Inter Exams: జూలై లోనే టెన్త్, ఇంటర్ పరీక్షలు ..? జరపలేకపోతే ఇక లేనట్లే..!  క్లారిటీ ఇవ్వలేకపోతున్న ఏపి విద్యాశాఖ..!!

ap education minister adimulapu suresh talks about 10th, inter Exams

10th, Inter Exams: ఏపిలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. కరోనా నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేసిన ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వలేకపోతున్నది. పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్షాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుండి డిమాండ్ వస్తున్నా విద్యార్థుల భవిష్యత్తుకు పరీక్షల రద్దు మంచి పద్ధతి కాదన్నది ప్రభుత్వ వాదన. కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ టెన్త్, 12 తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. మెజార్టీ రాష్ట్రాల్లోనూ కరోనా నేపథ్యంలో పరీక్షలను రద్దు చేశాయి. ఏపిలోనూ పరీక్షలు రద్దు చేస్తే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ డిమాండ్ కు తలవొగ్గి రద్దు చేసినట్లు అవుతుందనీ, దానిపై క్రెడిట్ వారికి దక్కుతుందన్న భావనతోనే వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం లేదన్న విమర్శ ఉంది. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాటలను బట్టి చూస్తే ప్రభుత్వం పరీక్షలపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదన్నట్లుగా కనబడుతోంది.

ap education minister adimulapu suresh talks about 10th, inter Exams
ap education minister adimulapu suresh talks about 10th, inter Exams

తాజాగా నేడు పరీక్షల నిర్వహణపై మంత్రి సురేష్ తన అభిప్రాయాలను తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోందనీ క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. పరీక్షల నిర్వహణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Read More: AP High Court: సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..!!

ఇంటర్ పరీక్షలు బహుశా జులై మొదటి వారంలో జరగవచ్చని వెల్లడించిన ఆయన జూలై చివరి వారంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అన్నారు. జూలై నెలలో పరీక్షలు నిర్వహణ సాధ్యపడకపోతే ఇక అవకాశం ఉండదని భావిస్తున్నామన్నారు. తాము కఛ్చితంగా జూలై నెలలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం లేదన్నారు. అవకాశం ఉందని మాత్రమే చెబుతున్నానని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై ప్రస్తుతం సమీక్ష జరుపుతున్నామని చెప్పారు. పరీక్షలు రద్దు చేయడం పెద్ద పని కాదనీ, కానీ తర్వాత పర్యవసానాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.

కేరళ, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు పరీక్షలు జరిపాయని గుర్తు చేస్తూ చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పరీక్షలు జరుపుతోందని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకుని కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టి రాష్ట్రంలో పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సురేష్ వెల్లడించారు.

Related posts

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N