NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Navaneet Kaur: శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్..! కారణం అదేనంట..!!

Navaneet Kaur: మహరాష్ట్రలోని అమరావతి ఎంపి, సినీనటి నవనీత్ కౌర్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కుబడి చెల్లించుకున్నారు. ఇటీవల నవనీత్ కౌర్ కుల దృవీకరణ పత్రాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసి, జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించగా బాంబే హైకోర్టు తీర్పుపై స్టే మంజూరు చేసింది. కుల దృవీకరణ వివాదంలో ఆమెకు సుప్రీం కోర్టులో ఊరట లభించడంతో ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా స్వయంగా తెలియజేశారు. తన ఎన్నిక వ్యవహారంపై బాంబే హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడంతో శ్రీవారిని దర్శించుకున్నట్లు నవనీత్ కౌర్ చెప్పారు. 2004 నుండి 2009 వరకూ సినీరంగంలో ఉన్నారు. 2011లో వివాహం అయిన తరువాత సినీరంగానికి దూరంగా ఉన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

Navneet Kaur visits Tirumala
Navneet Kaur visits Tirumala

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ తెలుగు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. తెలుగు ప్రజల వల్లే తనకు పేరు వచ్చిందన్నారు. అందుకు కృతజ్ఞతగా తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, మహిళలు, యువతకు సహాయం చేస్తానన్నారు. దేశంలో కరోనా ప్రభావం తగ్గి ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు చెప్పారు.

Read More: SI Suspension: తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ ఎస్ఈ సస్పెన్షన్..! కారణం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!!

నవనీత్ కౌర్ రాజకీయ రంగ ప్రవేశానికి ముందు పలు తెలుగు సినిమాల్లో నటించారు. శత్రువు, శీను వాసంతి లక్ష్మి, జగపతి, గుడ్ బాయ్, రూమ్ మెట్స్, స్టైల్, బంగారు కొండ – పక్కా, 420, యమ దొంగ, మహారథి, జాబిలమ్మ తదితర సినిమాల్లో నటించారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju