NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Airports: నష్టాల ఊబిలో ఏపి ఎయిర్ పోర్టులు..! కారణాలు ఏమిటంటే..?

AP Airports: ఏపిలోని ఎయిర్ పోర్టులు అన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం అమరవాతి రాజధానిగా ప్రకటన చేసిన తరువాత వివిధ పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక వేత్తల రాకపోకలు సాగించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎయిర్ ట్రాఫిక్ పెరిగింది. ఫలితంగా విజయవాడ సమీపంలోని గన్నవరం, విశాఖ, తిరుపతి సమీపంలోని రేణిగుంట, రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టులతో పాటు నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోని విమానాశ్రయానికి కొత్తగా విమానాల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. కర్నూలులో కొత్తగా విమానాశ్రయం ఏర్పాటు చేశారు.

AP Airports are in huge losses
AP Airports are in huge losses

గత రెండేళ్లలో కరోనా పరిస్థితులనైతే నేమీ, మూడు రాజధానుల ప్రకటనతో అయితేనేమీ ఎయిర్ ట్రాఫిక్ ఒక్కసారిగా తగ్గిపోయింది. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వికే సింగ్ ఏపిలోని ఎయిర్ పోర్టుల పరిస్థితి గురించి వివరించారు. ఆయన తెలియజేసిన వివరాల ప్రకారం…గన్నవరం, రేణిగుంట, రాజమహేంద్రవరం, కడప ఎయిర్ పోర్టుల నష్టాలు ఏయేటి కాయేడు పెరిగిపోతున్నట్లు స్పష్టం అయ్యింది. పరిపాలనా రాజధానిగా జగన్మోహనరెడ్డి సర్కార్ ప్రకటించిన విశాఖ ఎయిర్ పోర్టు ఒక్కటి మాత్రమే రాష్ట్రంలో పెద్దగా నష్టాలు లేకుండా నెట్టుకువస్తోంది.

గన్నవరం ఎయిర్ పోర్టు 2018 -19 ఏడాదిలో 41.7 కోట్ల నష్టాలలో ఉండగా, 2019-20 ఏడాదిలో రూ.60.22, 2020 -21 ఏడాదికి రూ.63.95 కోట్ల నష్టాలకు చేరింది. ఇక రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టు విషయానికి వస్తే 2018 -19లో 32.84 కోట్ల నష్టాల్లో ఉండగా, 2019- 20 ఆర్థిక సంవత్సరంలో 45.27 కోట్లుకు చేరాయి. ఇక 2020 – 21 ఏడాదికి ఆ నష్టాలు కాస్త తగ్గి రూ.44,19 కోట్లకు చేరింది. సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోని ఎయిర్ పోర్టు కూడా నష్టాల బాటలోనే కొనసాగుతోంది. 2018-19లో రూ.9.81 కోట్లు ఉండగా 2019-20 లో రూ.10.51 కోట్లకు చేరాయి. 2021-21లో ఈ నష్టాలు కాస్తంత తగ్గి రూ.8.93 కోట్లకు తగ్గింది. ఇక రేణిగుంట ఎయిర్ పోర్టు పరిస్థితి వీటికి భిన్నంగా ఏమీ లేదు.

 

 

 

Related posts

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!