NewsOrbit
న్యూస్ సినిమా

AR Murugadoss: క్రియేటివిటీ ఎక్కువవడం వల్లే స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్ మురగదాస్ వరుసగా ఫ్లాప్స్ ఇచ్చాడు..?

AR Murugadoss: కొందరు దర్శకులు క్రియేటివ్ డైరెక్టర్స్‌గా అన్నీ చిత్ర పరిశ్రమలలో తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. హీరోలకి, నిర్మాతలకి అలాంటి క్రియేటివ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేయాలని బాగా తాపత్రయపడుతుంటారు. అయితే కొన్నిసార్లు క్రియేటివిటీ మరీ ఎక్కువైతే భారీ డిజాస్టర్స్ కూడా చూడాల్సి వస్తుంది. అలా ఓ భారీ డిజాస్టర్ గనక పడిందంటే ప్లాన్ చేసుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ డైలమాలో పడతాయి. డేట్స్ ఇస్తానని అన్న చెప్పిన హీరోలు కూడా తర్వాత చూద్దాం అంటూ మొహాం చాటేస్తారు. నిర్మాతలు కూడా ఆల్రెడీ ప్రాజెక్ట్స్ కమిటయ్యాను..నెక్స్ట్ ఇయర్ చూద్దాం అంటూ తప్పించుకుంటారు.

ar-murugadoss-gave continuous flops due to high creativity
ar-murugadoss-gave continuous flops due to high creativity

అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏ.ఆర్ మురగదాస్ ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం ఆయన బ్యాక్ టు బ్యాక్ ఇచ్చిన భారీ డిజాస్టర్సే. అది కూడా ఇద్దరు సూపర్ స్టార్స్‌కి ఇవ్వడం ఇక్కడ షాకింగ్ విషయం. 2017లో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా స్పైడర్ అనే సినిమాను తెరకెక్కించాడు మురగదాస్. దర్శకుడు సూర్య ఈ సినిమాలో విలన్‌గా నటించాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు – మురగదాస్ అనగానే భారీ అంచనాలు ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్‌తో ఆ అంచనాలు మరో రేంజ్‌లో పెరిగాయి.

AR Murugadoss: డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి నిర్మాతల కార్యాలయం మీద దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

కానీ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో విడుదలై ఊహించని టాక్‌తో అట్టర్ ఫ్లాప్ అనే సినిమాగా టాక్ తెచ్చుకుంది. మహేశ్ బాబుకి కూడా ఈ సినిమా అసలు ఆలోచనలోకి కూడా రాని విధంగా షాకిచ్చింది. మహేశ్ కంటే ఇందులో విలన్‌గా నటించిన దర్శకుడు సూర్యకే ఎక్కువ పేరు వచ్చింది. మ్యూజిక్ పరంగా సినిమా ఆకట్టుకోలేకపోయింది. రకుల్ ప్రీత్ కూడా ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత విజయ్‌తో సర్కార్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా తమిళ ప్రేక్షకుల వరకు ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తర్వాత మళ్ళీ మరో భారీ డిజాస్టర్ ఇచ్చాడు.

ఆ సినిమా కూడా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కి. దర్బార్ అనే సినిమాను రజనీకాంత్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా ఎక్కువ భాగం ముంబైలో తెరకెక్కించారు. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ నివేత థామస్ రజనీ కూతురుగా నటించింది. కబాలి, కాలా, పేట సినిమాలతో వరుసగా భారీ ఫ్లాప్స్ చూసిన రజనీకాంత్ దర్బార్‌తోనైనా బ్లాక్ బస్టర్ అందుకుంటాడని అందరూ భావించారు. కానీ బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్‌గా మిగలడంతో డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి నిర్మాతల కార్యాలయం మీద దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

AR Murugadoss: ఆయన కెరీర్ కాస్త ఇబ్బందుల్లో పడిందని చెప్పుకుంటున్నారు.

అదే సమయంలో మురగదాస్ ..అల్లు అర్జున్‌తో సినిమా చేయనున్నట్టు..దాని కోసం హైదరాబాద్ వచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఆయనతో గజిని సినిమా సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి. కానీ ఆ తర్వాత దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఏదీ రాలేదు. మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్‌తో వచ్చే ఏడాడి ఓ సైన్స్ ఫిక్షన్ మూవీని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలీదు గానీ మురగదాస్ మరీ క్రియేటివ్ మూవీస్ చేయడం వల్లే ఆయన కెరీర్ కాస్త ఇబ్బందుల్లో పడిందని చెప్పుకుంటున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri