NewsOrbit
న్యూస్

బదిలీపై కోర్టులోనే వివరణ

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ డిజి ఏబి వెంకటేశ్వరరావును కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయటంపై టిడిపి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికలతో సంబంధం లేని పోస్టులో ఉన్న వ్యక్తిని బదిలీ చేయటంపై టిడిపి నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసి వివరణ కోరారు. ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున, కోర్టుకే వివరణ ఇస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా నేతలకు స్పష్టం చేశారు. పోలీసు అధికారుల బదిలీపై టిడిపి నేతలు సిఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్, జూపూడి ప్రభాకర్ బుధవారం సునీల్ అరోరాతో భేటీ అయ్యారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.  ‘ఇంటెలిజెన్స్ డిజిని బదిలీ చేయటం దేశ చరిత్రలో ఇప్పటివరకూ జరగలేదు. ఎన్నికలతో ఇంటెలిజెన్స్ డిజికి సంబంధం లేదు. ఆయన లా అండ్ ఆర్డర్ చూసుకునే పదవిలో లేరు. కేవలం ముఖ్యమంత్రి రక్షణ మాత్రమే చూసుకుంటురు. ఆయన్ని ఎందుకు బదిలీ చేశారు’ అని ఎన్నికల సంఘాన్ని వివరణ కోరేందుకు కలిశామని నేతలు చెప్పారు. బదిలీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖను ఎన్నికల సంఘానికి అందజేశామని తెలిపారు.

వైసిపి ఫిర్యాదు చేసిన వెంటనే ఎన్నికల సంఘం బదిలీ చేయటం సరికాదని నేతలు పేర్కొన్నారు. ఎటువంటి విచారణ చేయకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని ఎన్నికల సంఘాన్ని అడిగామని వారు తెలిపారు.

అధికారులను బదిలీ చేస్తారని విజయసాయిరెడ్డి ముందే చెప్పటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.

25 న ఫిర్యాదు చేస్తామనీ, 26 న బదిలీ చేస్తారనీ విజయసాయిరెడ్డి చెప్పారు. దానికి తగ్గట్లే ఎన్నికల సంఘం బదిలీలు చేసింది. దీనివల్ల ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిపై అనుమానాలు కలుగుతున్నాయని సునీల్ అరోరాకు తెలియజేశామన్నారు.

అలాగే ఎన్నికల సంఘం పరిధిలోకి ఎవరొస్తారో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందనీ, ఈ ఉత్తర్వుల మేరకు ఇంటెలిజెన్స్ డిజి ఎన్నికల సంఘం పరిధిలోకి రారనీ సునీల్ అరోరా దృష్టికి తీసుకెళ్లామన్నారు.

తాము ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని సునీల్ అరోరాని కోరామని తెలిపారు. అదేవిధంగా, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలను వాయిదా వేయాలని కోరినట్టు చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ చిత్రం విడుదలను వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని ఒక వినతిపత్రం సమర్పించినట్టు తెలిపారు.

Related posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Leave a Comment