NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ సినిమా

MAA Elections: మా ఎన్నికలపై ఏపి సర్కార్ ఇచ్చిన క్లారిటీ ఇదీ..!!

AP Employees: Covering or Warning..!?

MAA Elections:  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో రాజకీయ ప్రమేయంపై వస్తున్న నేపథ్యంలో ఏపి మంత్రి పేర్ని నాని స్పందించారు. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల మంచు విష్ణు మాట్లాడుతూ ఏపి సీఎం వైఎస్ జగన్ తనకు బంధువు (బావ) అని, తెలంగాణ మంత్రి కేటిఆర్ స్నేహితుడు అంటూ పేర్కొన్న నేపథ్యంలో మా ఎన్నికల్లో ముఖ్యమంత్రులు జగన్, కేసిఆర్, బీజేపీలను ఎందుకు లాగుతున్నారంటూ ప్రకాశ్ రాజ్ విమర్శించారు. చుట్టాలు, స్నేహితులు అయినంత మాత్రనా వారు వచ్చి ఎన్నికల్లో ఓట్లు వేస్తారా, లేక ఓట్లు వేయిస్తారా అంటూ ప్రకాశ్ రాజ్ నిలదీశారు. ఈ నేపథ్యంలో ఏపి ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని స్పందించి వివరణ ఇచ్చారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలతో సీఎం జగన్ కు గానీ, ఏపి ప్రభుత్వానికి గానీ వైసీపీకి గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అసలు మా ఎన్నికలపై తమకు ఏ మాత్రం ఆసక్తి లేదని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి పేర్ని నాని ఓ వీడియో సందేశాన్ని విడుదల చేయగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

MAA Elections: ap minister perni nani clarity
MAA Elections: ap minister perni nani clarity

MAA Elections: సీఎం జగన్, మంత్రి నానిలకు ప్రకాశ్ రాజ్ ధన్యవాదాలు

కాగా మా ఎన్నికల్లో తమ జోక్యం ఉండదనీ, సినీ రంగానికి సంబంధించిన ఎన్నికలపై తమకు ఆసక్తి లేదని ఏంపి మంత్రి పేర్ని నాని ప్రకటన విడుదల చేయడాన్ని ప్రకాశ్ రాజ్ స్వాగతించారు. ఈ సందర్భంగా సీఎం వైెఎస్ జగన్, మంత్రి పేర్ని నానిలకు ప్రకాష్ రాజ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఏంతో బాధ్యతాయుతంగా స్పందించి ప్రకటన చేశారని పేర్కొన్నారు. మా ఎన్నికలపై ప్రభుత్వ స్పందనను గౌరవిస్తున్నానని తెలిపారు.

జోరందుకున్న ప్రచారం

మా ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని ఉదృతం చేశారు. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ మద్య మాటల తూటాలు పేలుతున్నాయి, విమర్శలు, ప్రతి విమర్శలతో సినీ పరిశ్రమ రాజకీయం వేడెక్కింది. ఈ నెల 10వ తేదీ పోలింగ్ జరగనుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు సభ్యులను కలిసి ఓట్లు అభ్యర్ధించడంతో పాటు సినీ పెద్దలను కలిసి వారి మద్దతు కూడగట్టుకునే పనిలో నిమగ్నమైయ్యారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరో పక్క సీనియర్ నటుడు మోహన్ బాబు ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మా ఎన్నికలను ఉద్దేశించి నీచ, నికృష్ణ, భష్టు రాజకీయాలు చోటుచేసుకున్నాయంటూ హాట్ కామెంట్స్ చేయడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?