NewsOrbit
న్యూస్

AP High Court: రాజధాని అమరావతి రైతులకు గుడ్ న్యూస్ అందించిన హైకోర్టు…

AP High Court: రాజధాని ప్రాంత అమరావతి రైతులకు ఏపి హైకోర్టు గుడ్ న్యూస్ అందించింది. అమరావతి ఉద్యమం ఎందుకు చేపట్టాల్సి వచ్చిందన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసే ఉద్దేశంతో అమరావతి ప్రాంత రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి నుండి తిరుమల వరకూ మహాపాద యాత్ర చేయాలని సంకల్పించిన విషయం తెలిసిందే. అయితే రైతులు పాదయాత్ర చేస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు వారి పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. జేేఏసీ నేతలకు పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమని డీజీపీ స్పష్టం చేస్తూ లేఖ అందించారు. ఈ నేపథ్యంలో పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి జేఏసి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై  హైకోర్టు కోర్టు విచారణ చేపట్టింది.,

AP High Court gives permission for amaravathi farmers padayatra
AP High Court gives permission for amaravathi farmers padayatra

AP High Court: షరతులతో మహాపాదయాత్రకు అనుమతి

ఈ పిటిషన్ పై రైతులు పాదయాత్ర చేస్తే ప్రభుత్వానికి, పోలీసులకు ఏమిటి అభ్యంతరం అని కోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులు గ్రామాల్లోకి వెళితే వారిపై రాళ్లు విసిరే ప్రమాదం ఉందని, రైతుల పాదయాత్రతో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే అవకాశం ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. రైతుల తరపు న్యాయవాది లక్ష్మీనారాయణ దీనిపై వాదనలు వినిపిస్తూ రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారని తెలియజేస్తూ..అనుమతి ఇవ్వలేమంటూ డీజీపీ రాసిన లేఖలో సరైన కారణాలు చూపలేదని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం రైతుల పాదయాత్రకు షరతులతో కోర్టు అనుమతి ఇచ్చింది.

నవంబర్ 1 నుండి 45 రోజులు పాదయాత్ర

రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో అమరావతి ప్రాంత రైతులు, మహిళలు కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. నవంబర్ 1 వ తేదీ నుండి డిసెంబర్ 17 వరకూ 45 రోజుల పాటు పాదయాత్ర చేపట్టనున్నట్లు అమరావతి జేఏసి, రైతు సంఘాల నేతలు ప్రకటించారు. అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్క రైతులు అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరో పక్క న్యాయపోరాటం చేస్తున్నారు. మరో పక్క మూడు రాజధానులకు అనుకూలంగా కూడా కొందరు కొద్ది రోజులు శిబిరాన్ని నిర్వహించారు. ప్రస్తుతం మూడు రాజధానుల అంశం హైకోర్టు విచారణలో ఉంది.

 

Related posts

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N