NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP SEC: నెల్లూరు కార్పోరేషన్ సహా 12 మున్సిపాలిటీల ఎన్నికలకు షెడ్యుల్ విడుదల చేసిన ఎస్ఈసీ

AP SEC: ఏపిలో బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ రెండు క్రితం జరిగిన సంగతి తెలిసిందే. రేపు కౌంటింగ్ జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల కాక తగ్గకమునుపే రాష్ట్రంలో మరో ఎన్నికల నగరా మోగింది. నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నేడు షెడ్యుల్ విడుదల చేసింది. ఈ నెల 3వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. 15వ తేదీ పోలింగ్, 17వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు.,

AP SEC says remaining municipal elections notification on November 3rd
AP SEC says remaining municipal elections notification on November 3rd

 

AP SEC: 13 మున్సిపాలిటీల్లో 15 న పోలింగ్

నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు జిల్లా లోని గురజాల, దాచేపల్లి, ప్రకాశం జిల్లా దర్శి, చిత్తూరు జిల్లా కుప్పం, కర్నూలు జిల్లా బేతంచెర్ల, వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం, రాజంపేట, అనంతపురం జిల్లా పెనుగొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మున్సిపాలిటీల్లో 15వ తేదీ పోలింగ్ జరగనున్నది. అదే విధంగా 498 పంచాయతీల్లో 69 సర్పంచులకు ఈ నెల 14న ఎన్నిక నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరగనుంది. 13 జిల్లాల్లో మిగిలిన 187 ఎంపీటీసీలు, 16 జడ్పీటీసీ లకు ఈ నెల 16న పోలింగ్ నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి 18న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు.  ఈ మేరకు ఎస్ఈసీ షెడ్యుల్ విడుదల చేసింది.

 

29న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

మరో పక్క ఏపి, తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు రెండు రోజుల క్రితం ఈసీ షెడ్యుల్ విడుదల చేసింది. ఏపిలో మూడు, తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసింది. ఈ నెల 9న వీటికి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 29న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఏపిలో మే 31 ముగ్గురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. తెలంగాణలో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 3న ముగిసింది. ఈ స్థానాలకు గతంలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా వ్యాప్తి కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది ఈసీ. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఈసీ షెడ్యుల్ విడుదల చేసింది. ఏపి అసెంబ్లీలో వైసీపీకి, తెలంగాణ అసెంబ్లీ లో టీఆర్ఎస్ కు మెజార్టీ ఎమ్మెల్యేలు ఉండటంతో ఆయా పార్టీల అభ్యర్ధుల ఎన్నిక లాంఛన ప్రాయమే అవ్వనుంది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju