NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Huzurabad By Poll: హూజూరాబాద్ ఫలితాలపై కాంగ్రెస్‌లో రేవంత్ వ్యతిరేకుల హాట్ కామెంట్స్..!!

Huzurabad By Poll:  హూజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ (BJP) అభ్యర్ధి ఈటల రాజేందర్లీ (Etela Rajender) డ్ లో ఉన్నారు గెలుపు దిశగా రౌండ్ రౌండ్ కు మెజార్టీ నమోదు అవుతోంది. కాంగ్రెస్ (Congress)  పార్టీ అభ్యర్ధి వెంకట్ బల్మూరు కు 5వేలకు మించి ఓట్లు వచ్చే పరిస్థితి కనబడటంలేదు. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయే పరిస్థిత నెలకొంది. దీంతో హూజూర్‌నగర్ ఫలితాన్ని పురస్కరించుకుని  పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గట్టిగా కష్టపడితే అది ఈటలకు మైనస్ గా మారి అధికార టీఆర్ఎస్ కు ప్లస్ అవుతుందని భావించిన విషయం తెలిసిందే. అందుకే స్థానికులకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుండా స్థానికేతరుడికి టికెట్ కేటాయించారు.

Huzurabad By Poll: congress leaders serious comments on revanth reddy
Huzurabad By Poll: congress leaders serious comments on revanth reddy

Huzurabad By Poll:  క్యాడర్ ఉన్నా ఓట్లు వేయించుకోలేకపోయాం

దీన్ని పురస్కరించుకున్న టీ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి మాట్లాడుతూ హూజూరాబాద్ లో ఈటల 30వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని అన్నారు. టీఆర్ఎస్ కు ఈటల పెద్ద షాక్ ఇవ్వబోతున్నారని అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి టీఆర్ఎస్ సర్వశక్తులను ఒడ్డిందన్నారు. అయిదు నెలల క్రితమే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయలేదన్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సిద్ధాంతం ప్రకారం ఈటలకు అక్కడ కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని వ్యాఖ్యానించారు.  హూజూరాబాద్ ఎన్నికలను ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల క్యాడర్ ఉన్నా ఓట్లు వేయించుకోలేకపోయామన్నారు. ఇక్కడి వాస్తవ పరిస్థితులను పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళతామన్నారు.

వెంకట్ బల్మూరును బలిపశువు ను చేశారు

మరో సీనియర్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్కలు బల్మూర్ వెంకట్ ను హజూరాబాద్ ఎన్నికల్లో బలిపశువు ను చేశారని విమర్శించారు. డిపాజిట్ వస్తే రేవంత్ ఖాతాలో, గల్లంతు అయితే సీనియర్ల ఖాతాలో వేస్తారా అని ప్రశ్నిస్తూ ఇలాంటి ప్రచారానికి రేవంత్ మనుషులు సిద్దంగా ఉంటారని అన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హూజూరాబాద్ ఫలితాలు ఊహించిన విధంగానే వస్తున్నాయన్నారు. తనను మంత్రి వర్గం నుండి కేసిఆర్ అప్రజాస్వామిక పద్దతిలో తొలగించిన విషయాన్ని ఈటల రాజేందర్ చాలా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారనీ అందుకే ఆయనపై సానుభూతి వచ్చిందన్నారు. హూజూరాబాద్ ఎన్నికల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలు స్వాగతించలేదని అన్నారు. ఈటెల గెలుపును బీజేపీ గెలుపు గా బండి సంజయ్ చెప్పుకోవడం సరికాదని అన్నారు.  వాస్తవరం చెప్పాలంటే.. ఈటల గెలవాలని బండి సంజయ్ కోరుకోలేదనీ వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్ సొంతంగా ప్రచారం చేసుకున్నారనీ, బీజేపీ అభ్యర్ధినని ఎక్కడా చెప్పుకోలేదన్నారు. ఇది ముమ్మాటికీ ఈటల వ్యక్తిగత విజయమేనని స్పష్టం చేశారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju