Aadhaar, Pan Card: ఆధార్, పాన్ కార్డు.. ఈ రెండు లేకపోతే ఏ పని జరగదు.. ఆర్థికలావాదేవీలకు పాన్ తప్పనిసరి.. మిగతా ఏ పని కావాలన్నా, ఏది చేయాలన్నా.. ఆధార్ తప్పనిసరి.. ఇది లేకపోతే మనిషికి ఐడెంటిటినే లేనట్టు.. ప్రభుత్వ పని, ఆర్థిక లావాదేవీలు, ధృవీకరణ పత్రాలు, పథకాల కోసం ఆధార్, పాన్ కార్డులు కచ్చితంగా ఉండాలి. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఈ రెండు లేకపోతే పనికాదు. అందుకే ఆధార్, పాన్ కార్డులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.
సాధారణంగా మనిషి జీవించి ఉన్నప్పుడు వీటితో అవసరం ఉంటుంది. ఒకవేళ మరణించాక వీటితో ఏం అవసరం పడుతుంది. అప్పుడు వీటిని ఏం చేయాలనే అనుమానం కొందరికి కలిగి ఉండవచ్చు. ఒకవేళ ఈ కార్డులు అక్రమార్కులకు దొరికితే ఏం జరుగుతుంది. అలాంటప్పుడు మరణించిన వ్యక్తి కార్డులను ఏం చేస్తే బాగుంటుందో తెలిసుకోండిలా..
PAN ఎలా క్లోజ్ చేయాలి..
మరణించిన వ్యక్తి పాన్ కార్డును ఐటీ రిటర్న్స్(IT Returns) దాఖలు చేసి, ఆ డబ్బు అకౌంట్లో జమ అయ్యేవరకు యాక్టివ్‌లోనే ఉంచాలి. మొత్తం ప్రాసెస్ పూర్తయ్యాక అకౌంట్ క్లోజ్ చేసేందుకు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంటుకు అప్లికేషన్ పెట్టుకోవాలి. దీనిని చనిపోయిన వారి వారసులు మాత్రమే చేయడానికి వీలుంది. ఇతరులకు ఆ అధికారం లేదు. మరణించిన వ్యక్తి పాన్ నెంబర్‌ను మరొక వ్యక్తి పేరు మీదకు కూడా బదిలీ చేయించుకోవచ్చు. అది కూడా మరణించిన వ్యక్తి అకౌంట్ భవిష్యత్‌లో మీకు అవసరమని భావించినప్పుడు మాత్రమే. ఇకపోతే చనిపోయిన వ్యక్తుల పాన్ కార్డ్ అకౌంట్‌ను మూసివేయాలనుకుంటే వారి వారసుడు ఐటీ శాఖ అసెస్సింగ్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్లో చనిపోయిన వ్యక్తి పేరు, పాన్ నెంబర్, బర్త్ డేట్ , డెత్ సర్టిఫికెట్‌ను జతపరచాలి.
ఆధార్ ఎలా క్లోజ్ చేసుకోవాలి..
ఇక మరణించిన వ్యక్తి ఆధార్‌ను ఏం చేయాలంటే.. ప్రస్తుతం ఆధార్ కార్డును చిరునామా కోసమే కాకుండా ఇతర పనులు, సంక్షేమ పథకాలకు ఆధార్ నెంబర్ తప్పనిసరి. సిమ్, రేషన్, గ్యాస్ సబ్సిడీ, ఆరోగ్యం, చదువు, పౌరసత్వం ఇలా అన్నింటికి ఆధార్ కార్డును ఉపయోగిస్తున్నారు. అయితే, వ్యక్తి చనిపోయాక ఆధార్‌ను ఎలా క్లోజ్ చేయాలనే సిస్టమ్ దేశంలో ఇప్పటి వరకు రాలేదు. పాన్ కార్డుకు మాత్రమే ఆ ఫెసిలిటీ ఉంది. అందుకని మరణించిన వారి ఆధార్ కార్డున అక్రమార్కుల చేతిలోకి వెళ్ళకుండా వారి కుటుంబీకులు ఇంట్లోనే సురక్షితంగా భద్రపరుచుకోవాలి.