సూపర్‌స్టార్ మహేష్ 25వ సినిమా `మహర్షి`. ఏప్రిల్ 12 చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకోనుంది. మే 9న సినిమా విడుదల కానుంది. మహేష్ 25వ సినిమా కావడంతో.. సినిమా విడుదల ఫిక్స్ కావడంతో, సినిమాపై క్రేజ్ క్రియేట్ అయ్యింది. అయితే సినిమా ఓవర్సీస్ బిజినెస్ విషయంలో అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కాస్త భయపడుతున్నారట. అందుకు కారణం. మహర్షి ఓవర్సీస్ హక్కులను 18 కోట్ల రూపాయలు చెబుతున్నారట. సినిమా ఏమాత్రం బెడిసి కొట్టినా.. మునిగిపోయే ప్రమాదం ఉందని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ భయపడుతున్నారు. దీంతో నిర్మాతలు మరో పక్క ఓన్ రిలీజ్ చేసుకోవాలని కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు. చివరకు ఓవర్సీస్ ధర విషయంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
previous post
next post
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!