NewsOrbit
Featured న్యూస్ సినిమా

Samantha: పూజా హెగ్డే, రష్మిక మందన్నలను టార్గెట్ చేసిన సమంత..?

Samantha: సౌత్ సినిమా ఇండస్ట్రీలతో పాటు నార్త్ సినిమా ఇండస్ట్రీ అయిన బాలీవుడ్‌లోనూ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంటున్నారు పూజా హెగ్డే, రష్మిక మందన్న. ముఖ్యంగా వీరిద్దరు తెలుగులో పాన్ ఇండియన్ సినిమాలను చేస్తూనే, బాలీవుడ్‌లో బడా నిర్మాణ సంస్థలలో స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ అందుకుంటున్నారు. ఇప్పుడు రెమ్యునరేషన్ పరంగా కూడా పూజా, రష్మికనే టాప్ అని చెప్పుకుంటున్నారు. దాదాపుగా చిన్న సినిమాలను వీరు ఒప్పుకోవడం లేదు. పాన్ ఇండియన్ సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలను మాత్రమే ఓకే చేస్తున్నారట.

is Pooja hegde, Rashmika mandanna is targetted by Samantha...?
is Pooja hegde, Rashmika mandanna is targetted by Samantha…?

పూజా హెగ్డే ..తెలుగులో రాధే శ్యామ్ మూవీని పూర్తి చేసింది. ఈ సినిమా పాన్ ఇండియన్ స్థాయిలో 7 భాషలలో రిలీజ్ కాబోతోంది. అలాగే త్రివిక్రం శ్రీనివాస్ – మహేశ్ బాబు సినిమా, హరీశ్ శంకర్ – పవన్ కళ్యాణ్ సినిమాలు చేయబోతోంది. ఇక ఆచార్య మూవీ కూడా పూర్తి చేసిన పూజా కేవలం నెలరోజులుగా గ్యాప్‌తో రెండు సినిమాలతో రాబోతోంది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయితే ఇక పూజా రేంజ్ మరో లెవల్. అలాగే తమిళంలో విజయ్ సరసన పాన్ ఇండియన్ సినిమా చేస్తోంది. అక్కడ ఆమెకు ఇది రెండవ సినిమా. ఇక బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, రణ్వీర్ సరసన రెండు సినిమాలు చేస్తోంది.

Samantha: సమంత వీరినే టార్గెట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు.

ఇక రష్మిక మందన్న ఇప్పుడు అల్లు అర్జున్ సరసన పుష్ప అనే పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో 5 భాషలలో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే మరో సినిమా చేస్తున్న రష్మిక తెలుగులో కొత్తగా కమిటయిన సినిమాలు ఏవీ లేవు. కానీ హిందీలో మాత్రం ఆమె మూడు సినిమాలు చేస్తోంది. ఈ మూడు కూడా క్రేజీ మూవీస్. ఇక వీరిద్దరికీ ఉన్న క్రేజ్‌ను బట్టి 2 నుంచి 2.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారు.

అయితే ఇప్పుడు సమంత వీరినే టార్గెట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. సమంత కూడా శాకుంతలం సినిమాతో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నట్టు మేకర్స్‌కు క్లారిటీ ఇచ్చేసింది. అలాగే బాలీవుడ్‌లోనూ ఈ మధ్య చేసిన ది ఫ్యామిలీ మాన్ 2తో బాగా క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు ఇప్పుడు బాలీవుడ్‌లో మంచి క్రేజీ మూవీస్ ఆఫర్ వస్తాయని నమ్మకంగా చూస్తోంది. తెలుగు కంటే హిందీ ఇండస్ట్రీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలని కూడా సమంత డిసైడయిందట. ఈ క్రమంలో ఇప్పటికే తెలుగు తమిళ సినిమాలను పూర్తి చేసిన ఆమె కొత్తగా మరో రెండు సినిమాలకు సైన్ చేసింది.

Samantha: పాన్ ఇండియన్ సినిమాలకు సమంత చాలా వరకు పర్‌ఫెక్ట్.

ఈ రెండు సినిమాలకు ఆమె రెమ్యునరేషన్ దాదాపు 2.5 కోట్ల వరకు అందుకుంటుందట. అయితే ఇప్పుడు కొత్త సినిమా ఏదీ చేయాలన్నా 3 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు ప్రచారం అవుతోంది. ఒకరకంగా సౌత్‌లో తనే నంబర్ వన్ గా నిలవడానికే ఇలా ఫిక్స్ అయిందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు తెలుగులో పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న రష్మిక, పూజా హెగ్డే అందుకుంటున్న రెమ్యునరేషన్ కంటే మించి సమంత తీసుకోవాలని చూస్తోందట. చెప్పాలంటే సాంతకు కమర్షియల్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ ఉంది. అలాగే పాన్ ఇండియన్ సినిమాలకు తను చాలా వరకు పర్‌ఫెక్ట్. అందుకే ఇకపై రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకూడదనుకుంటుందట. అయితే దీనిపై అఫీషియల్ కన్‌ఫర్మేషన్ మాత్రం లేదు.

Related posts

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju