NewsOrbit
Featured న్యూస్ సినిమా

Sukumar: జస్ట్ మేకోవర్‌తోనే పుష్ప మూవీపై అంచనాలు పెంచేసిన సుకుమార్..

Sukumar: టాలీవుడ్‌లో సుకుమార్‌కు క్రియేటివ్ డైరెక్టర్‌గా మంచి పేరుంది. మొదటి సినిమా ఆర్య నుంచి ఆయన చాలా సెటిల్డ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నారు. లెక్కల మాస్టారుగా పనిచేసి దర్శకుడిగా మారిన సుక్కూ..సినిమా తీసే విధానంలోనూ కొన్ని లెక్కల ప్రకారమే తీస్తున్నాడు. సుకుమార్ తన సినిమాలలో చూపించే లెక్కలు, లాజిక్కులు మొదట్లో బాగానే అర్థమయ్యాయి. కానీ ఆ తర్వాతే మరీ లాజిక్కులు ఎక్కువై ప్రేక్షకులు కన్‌ఫ్యూజ్ అయ్యే రేంజ్‌కు వెళ్ళాయి. సుకుమార్ సినిమాలకు అన్నీ వర్గాల ప్రేక్షకులు ఉన్నారు.

pushpa movie expectations are created by sukumar with makeover alone
pushpa movie expectations are created by sukumar with makeover alone

అయితే మెజారిటీ భాగం ప్రేక్షకులు చదువుకున్న వారే ఉన్నారు. కాస్త బీ సీ సెంటర్స్‌లో సినిమా చూసే ప్రేక్షకులకు సుకుమార్ సినిమాలు అంతగా రీచ్ కావడం లేదనే కామెంట్స్ ‘1 నేనొక్కడినే’ వరకు వినిపించాయి. ఆర్య, ఆర్య 2 సినిమాలలో సుకుమార్ చెప్పిన లవ్ థియరీ యూత్ ఆడియన్స్ వరకు మాత్రమే రీచ్ అయింది. ఆ రీజియన్ ప్రేక్షకులను మాత్రమే ఈ సినిమాలు బాగా ఆకట్టుకున్నాయి. మాస్ ఆడియన్స్‌కు ఈ సినిమాలు అంతగా చేరుకోలేదని చెప్పాలి. ముఖ్యంగా ఆర్య 2లో సుక్కూ చూపించిన లాజిక్స్ కాస్త కన్‌ఫ్యూజన్‌కే గురి చేశాయి.

Sukumar: సుకుమార్ చెప్పిన లాజిక్స్ ఏంటో అర్థం కావు.

తర్వాత రామ్ పోతినేనితో జగడం సినిమా తీశాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా మిగిలింది. దీని తర్వాత 100 % లవ్ సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇందులో సుకుమార్ చెప్పిన లెక్కలు, లాజిక్కులు అందరికీ బాగానే అర్థమయ్యాయి. రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ మూవీగా నిలిచింది. తమిళంలోనూ ఈ సినిమా మంచి సక్సెస్‌ను సాధించింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తీసిన 1 నెనొక్కడినే చాలామందికి అంతగా అర్థం కాలేదు. ఒకటికి నాలుగుసార్లు చూస్తే గానీ సుకుమార్ చెప్పిన లాజిక్స్ ఏంటో అర్థం కావు.

ఆ తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో మళ్ళీ అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సంచలన విజయాన్ని అందుకుంది. ఇందులో రామ్ చరణ్, సమంతలతో పాటు అనసూయ మేకోవర్ అందరికీ బాగా నచ్చింది. ఇలాంటి సినిమా చూసి చాలా కాలం అవడంతో ప్రేక్షకులు రంగస్థలం సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అంతేకాదు చాలామది హీరోలు ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమా కథ కావాలని సుకుమార్‌ను అడిగారు. వారిలో అల్లు అర్జున్ ఒకరు. దాంతో పుష్ప అనే సినిమాను రెండుభాగాలుగా రూపొందిస్తున్నాడు సుకుమార్.

Sukumar: ఈ సినిమా బ్యాక్ డ్రాప్ కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం కాబట్టి అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

ఎప్పుడైతే పుష్ప టైటిల్‌తో పాటు అల్లు అర్జున్ మాసివ్ లుక్ రిలీజైందో భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. ఈ అంచనాలను సుకుమార్ ఎప్పటికప్పుడు మిగతా నటీ నటుల ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేస్తూ పెంచుకుంటూ వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పుష్ప సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ ఫస్ట్ లుక్ పోస్టర్స్ అదిరిపోయాయి. సినిమాకు సగం హైప్ వచ్చిందంటే వీరి మేకోవర్‌తోనే. రంగస్థలం మించి భారీ సక్సెస్ సాధించడమే లక్ష్యంగా సుకుమార్ – అల్లు అర్జున్ పెట్టుకున్నారని అర్థమవుతోంది. ఇక ఈ సినిమా బ్యాక్ డ్రాప్ కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం కాబట్టి అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. చూడాలి మరి సుకుమార్ పుష్పతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో.

Related posts

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?