Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ పదకొండవ వారంలో కెప్టెన్ అయిన మానస్..నీ శనివారం జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున(Nagarjuna) అభినందించడం తెలిసిందే. ఈ క్రమంలో హౌస్లో మానస్(Manas) నీ… మొదటి నుండి బాగా ఇష్టపడుతున్న కంటెస్టెంట్ పింకీ(Pinky) అని అందరికీ తెలుసు. ట్రాన్స్ జెండర్ పింకీ తన కంటే ఎక్కువగా మానస్ గేమ్ నే ఇష్టపడుతూ ఉంటది. మానస్ గెలుపుని తన గెలుపుగా భావిస్తున్నది.. అదే రీతిలో మానస్.. బాధపడితే.. అతని కంటే ముందుగానే పింకీ బాధపడుతూ ఉంటది. మరి డీప్ రిలేషన్ లోకి పింకీ మానస్ విషయంలో… వెళ్ళిపోతూ ఉండటంతో పాటు ఆమె సెన్సిటివ్ పర్సన్ కావటంతో.. నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లో మానస్ కి ఓ వీడియో చూపించి అలెర్ట్ చేశారు.
హౌస్ లో మానస్(Manas) పింకీ పై ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత… కాజల్ దగ్గర మానస్ వస్తావని తీసుకొచ్చి పింకీ ఏడుస్తూ పడుకోవడం.. వీడియో చూపించి జాగ్రత్తగా ఉండాలని.. పింకీ కి.. సరిగ్గా అర్థమయ్యేలా డిలీట్ చేసి మరి డీప్ లోకి వెళ్ళకుండా.. నువ్వే చూసుకోవాలి మనస్ అంటూ.. నాగార్జున హెచ్చరించారు. ఇదే రీతిలో కొనసాగితే.. ఆమె ఏదైనా చేసుకునే అవకాశం ఉందని.. చాలా డీప్ రిలేషన్ లో కి వెళ్లి పోతుంది, నీ గురించి బాగా ఆలోచిస్తుంది.. పింకీ పట్ల జాగ్రత్తగా వ్యవహరించు మానస్ అని.. కన్స్ట్రక్షన్ రూమ్లో తెలిపారు.
ఓ అబ్బాయి తో రిలేషన్ లో ఉండగా
కాగా ఈ తరహాలోనే గతంలో ఓ అబ్బాయి తో రిలేషన్ లో ఉండగా .. అతడు తర్వాత పింకీ నీ ట్రాన్సజెండర్ అంటూ దారుణమైన పరుష పదజాలంతో బూతులు మాట్లాడటం తో.. మనస్తాపానికి గురయ్యి తనకుతానుగా అనేక రీతులుగా గాయపరుచు కొటడం జరిగింది. ఇదే విషయాన్ని మానస్.. నాగార్జున(Nagarjuna)కి తెలియజేసి మెల్లమెల్లగా పింకీ తో మాట్లాడతానని.. రిలేషన్ మరీ లోతుగా వెళ్లకుండా చుసుకుంటానని తెలిపారు