NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: హూజూరాబాద్ లో టీఆర్ఎస్ ఒడినా ఆ ఇద్దరికీ పదవులు..! హామీ నిలబెట్టుకున్న కేసిఆర్…!!

KCR: హూజూరాబాద్ ఉప ఎన్నికలలో ఎలాగైనా ఈటల రాజేందర్ ను ఓడించాలన్న పట్టుదలతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ ఎన్నికలకు ముందు పలువురు కీలక నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న ఎల్ రమణ, హూజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి పాటు పలువురు కీలక నేతలు టీఆర్ఎస్ లో చేరారు వీరికి కేసిఆర్ ఆ సమయంలో ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ఖాళీల భర్తీ నేపథ్యంలో కేసిఆర్ వారికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారు. పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించి కేబినెట్ ఆమోదంతో గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ కు పంపినా సాంకేతిక కారణాలతో గవర్నర్ ఆమోదం తెలుపని నేపథ్యంలో ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాడి కౌశిక్ రెడ్డికి కన్ఫర్మ్ చేశారు. తాజాగా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారులో ఎల్ రమణకు అవకాశం కల్పించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో 12 మంది సభ్యుల జాబితాకు సీఎం కేసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం టీఆర్ఎస్ అధిష్టానం సోమవారం అధికారికంగా ప్రకటించనున్నది.

TRS local bodies mlc candidates finalized KCR
TRS local bodies mlc candidates finalized KCR

Read More: Pawan Kalyan: జగన్ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు..!!

KCR: స్థానిక సంస్థల కోటాలో ఎల్ రమణకు అవకాశం

రేపు, ఎల్లుండి పలువురు అభ్యర్ధులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. పలు జిల్లాలలో పలువురికి తిరిగి అవకాశం కల్పించారు. పలువురికి మొండిచేయి చూపించారు. సిట్టింగ్ లలో అయిదుగురికి మాత్రమే తిరిగి అవకాశం కల్పించారు. కొత్తగా ఎడుగురికి ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కుతోంది. అయితే నిజామాబాద్ నుండి కల్వకుంట్ల కవిత అభ్యర్ధిత్వంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆమె వద్దంటే ఆకుల లలితకు అవకాశం ఇవ్వనున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ పురాణం సతీష్ స్థానంలో దండే విఠల్, కరీంనగర్ నుండి ఎల్ రమణ, భానుప్రసాద రావు, ఖమ్మం నుండి తాతా మధు, మహబూబ్ నగర్ నుండి సాయిచంద్, కసిరెడ్డి నారాయణరెడ్డి, రంగారెడ్డి నుండి శంఖీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి, వరంగల్లు నుండి పోచారం శ్రీనివాసరెడ్డి, నల్లగొండ నుండి ఎంసీ కోటిరెడ్డి, మెదక్ జిల్లా నుండి డాక్టర్ యాదవరెడ్డిని ఖరారు చేశారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N