NewsOrbit
న్యూస్ సినిమా

Akhanda: అఖండ సినిమా సూపర్ హిట్ కావడానికి 5 కారణాలివే..!

Balakrishna: బాలకృష్ణ, ప్రజ్ఞా జైస్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన అఖండ సినిమా (Akhanda Movie) విశేషమైన స్పందనతో బాక్సాఫీసును షేక్ చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా విదేశాల్లో కూడా అఖండ కాసుల వర్షం కురిపిస్తోంది. ఎవరి నోట విన్నా అఖండ సూపర్ హిట్ అనే మాటే వినపడుతోంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ అఖండ హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ చేసిన అత్యుత్తమ సినిమాల్లో అఖండ ఒకటని కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. వర్డ్ ఆఫ్ మౌత్ తో అఖండ సినిమా వీక్షించేందుకు సగటు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. అయితే ఊహించని రీతిలో బాలకృష్ణ సినిమా సూపర్ హిట్ కావడానికి ఐదు ముఖ్య కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బాలకృష్ణ & బోయపాటి

బాలకృష్ణ క్రౌడ్ పుల్లర్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. అదే అతని తారాగణంలో మంచి కథాబలం ఉన్న సినిమా వస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుందో ప్రస్తుతం థియేటర్ల వద్ద ప్రేక్షకులు చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలున్నాయి. బోయపాటి, బాలకృష్ణ కాంబోలో వచ్చిన లెజెండ్, సింహా ప్రేక్షకులను బాగా అలరించాయి. దాంతో బాలకృష్ణతో కలిస్తే బోయపాటి అద్భుతాలు సృష్టిస్తాడని ప్రేక్షకుల మనసుల్లో ముద్ర పడిపోయింది. అందులోనూ ఈసారి బాలకృష్ణను అఘోరగా, కామన్ మ్యాన్ గా చూపించనున్నామని బోయపాటి చెప్పడం మరింత ఆసక్తిని రేపింది. దాంతో సినిమా రిలీజ్ కాగానే ప్రేక్షకులు హై ఎక్స్ పెక్టేషన్స్ తో థియేటర్ల ముందు క్యూ కట్టారు. వీరంతా సినిమా అదిరిపోయేలా ఉందని అభిప్రాయాలు వ్యక్తపరచడంతో ఇతర ప్రేక్షకులు కూడా ఉత్సుక‌త‌తో అఖండ మూవీని చూసేందుకు హాళ్లకు వస్తున్నారు.

2. ప్రోమో కంటెంట్

ప్రేక్షకుల్లో ఒక సినిమాపై ఆసక్తిని రగిలించాలి అంటే ప్రోమో కంటెంట్ హై రేంజ్ లో ఉండాలి. అయితే ఆ విషయంలో బోయపాటి పూర్తిస్థాయిలో సక్సెస్ సాధించాడు. బాలయ్య పుట్టినరోజున స్టన్నింగ్ డైలాగులతో ప్రేక్షకులకు కేక పుట్టించేలా ఒక టీజర్ రిలీజ్ చేశాడు. ఈ టీజర్ లో బాలయ్య భలే కొత్తగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. అఘోరా అనే కొత్త కాన్సెప్ట్ తో అగ్ర హీరో బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారనేదే ఒక ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది. టీజర్ తర్వాత రిలీజ్ అయిన అన్ని ప్రోమో కంటెంట్లు ఉత్తేజపూరితంగానే ఉన్నాయి. ఇవే సగం సినిమా సక్సెస్‌కు కారణమయ్యాయని చెప్పుకోవచ్చు.

3. అఘోర

ఒక స్టార్ హీరో అఘోరాగా నటించడమే చాలా కొత్త విషయం. అందులోనూ మెస్సియా ఆఫ్ మాస్ ఆడియన్స్ అయిన బాలకృష్ణ ఆ తరహా పాత్రలో నటిస్తున్నారనడంతో అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. కథ ఏంటి? బాలయ్య ఎలా అలరించబోతున్నారు? అని అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కుతూహలం నెలకొంది. ఈ క్రమంలో ప్రోమో కంటెంట్ లో బాలయ్య రుద్ర ప్రదర్శనతో డైలాగులు చెబుతూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేశారు. అయితే ముందస్తు అంచనాలకు మించి బాలయ్య నటన కిక్కెక్కించేలా ఉండటంతో ఇది సూపర్ సక్సెస్ అయ్యింది.

4. కరోనా తగ్గుముఖం

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో సినిమా హాల్స్ కు వచ్చేందుకు ప్రేక్షకులు వెనుకాడడం లేదు. మంచి సినిమా థియేటర్లలో సందడి చేస్తోందనే మాట వినగానే ప్రేక్షకులు సకుటుంబ సపరివార సమేతంగా హాళ్ళకు వచ్చేస్తున్నారు. ఇది కూడా అఖండ మూవీకి ప్లస్ అయ్యిందనే చెప్పాలి.

5. మాస్ ఆడియన్స్

బాలకృష్ణ సినిమాకి మాస్ ఆడియన్స్ ప్రతిసారీ వస్తారు. అయితే గత కొంత కాలంగా వారిని నిరాశపరుస్తున్న బాలకృష్ణ ఈసారి మాత్రం అఖండతో ఫుల్ ఖుషి చేశారు. చప్పట్లు కొట్టడానికి, కంఠం దద్దరిల్లేలా ఈలలు వేయడానికి ఈ సినిమాలో అడుగడుగునా సన్నివేశాలు ఉన్నాయి. దాంతో మూలనున్న మాస్ ఆడియన్స్ సైతం అఖండ థియేటర్లకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ కారణంగా కూడా బాలకృష్ణ సినిమా సూపర్ హిట్ అయ్యిందని చెప్పవచ్చు.

Related posts

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 4th 2024 Episode: కొడుకును ఈడ్చి కొట్టిన అనసూయ.. కార్తీక్‌, దీపకి అక్రమ సంబంధం అంటూ నీచంగా మాట్లాడిన నరసింహ..!

Saranya Koduri