Bangarraju: టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న సినిమా బంగార్రాజు. 2019లో వచ్చి భారీ హిట్ సాధించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను నాగ్ బృందం మొదలుపెట్టింది. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమాకు ఈ సినిమాకు మారింది ఒక్క లావణ్య త్రిపాఠి మాత్రమే.

నాగార్జున సరసన రమ్యకృష్ణ యదావిధిగా నటిస్తోంది. అందులో నాగార్జున డ్యూయల్ రోల్ పోషించాడు. ఇందులో నాగ చైతన్య నటిస్తుండగా తన సరసన యంగ్ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పుడు వీరి కాంబోలో తెరకెక్కించిన నాకోసం అనే లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. మెస్మైరిజింగ్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ సినిమాలో ఎంతో హైలెట్‌గా నిలుస్తుందని అందరూ చెప్పుకుంటున్నారు. అనూప్ రుబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
Bangarraju: విజువల్స్ చూస్తుంటే మరోసారి మనం సినిమా చూడబోతున్నామనేలా ఆసక్తి కలుగుతోంది.
జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకాలపై బంగార్రాజు చిత్రం తెరకెక్కుతోంది. ఈ సాంగ్‌లో విజువల్స్ చూస్తుంటే మరోసారి మనం సినిమా చూడబోతున్నామనేలా ఆసక్తి కలుగుతోంది. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా మరొకవైపు ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ అలాగే ప్రమోషన్స్ చక చకా జరిగిపోతున్నాయి. అన్నీ అనుకున్నట్టు పూర్తైతే సంక్రాంతి బరిలో దిగే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. అయితే సంక్రాంతి బరిలో పాన్ ఇండియన్ సినిమాలు ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ సినిమాలు రాబోతున్నాయి. మరి ఈ పోటీలో బంగార్రాజు వస్తాడా లేదా చూడాలి.