Video Viral: ఉద్యోగుల శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే నంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఎన్టీఓ సంఘ నేత బండి..!!

Share

Video Viral: తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఏపి ఎన్జీఓ సంఘ నేతలు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంఘ నేతల సమావేశంలో ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉద్యోగుల శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందేనని హెచ్చరించారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత నెలలో ఉద్యోగ సంఘాల నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి నుండి ఫోన్ రావడంతో “కంట్రోల్ లో ఉంటాం సార్, కంట్రోల్ లో ఉంటాం సార్” అంటూ అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించి వెళ్లిన ఆ నేతలే నేడు ప్రభుత్వంపై నిప్పులు చెరగడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

AP NGO leader Bandi sensational comments Video Viral
AP NGO leader Bandi sensational comments Video Viral

Video Viral: మీ మాయ మాటలకు నమ్మి 151 సీట్లు తెచ్చాం

“నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పిన మీ మాయ మాటలకు నమ్మి 151 సీట్లు తెచ్చాం, కాబట్టి మీరు మా వైపు చూడటం లేదు. ఈ యొక్క పిచ్చి పిచ్చి మున్సిపాలిటీలు గానీ, జిల్లా పరిషత్ లు గానీ ఇవన్నీ కూడా చచ్చిపోయే ముందు దీపం బాగా వెలుగుతుందంట. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ రోజున అయిదు డీఏలు ఇవ్వలేదో ప్రతిపక్షంలో కూర్చుంటానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు ఉద్యోగుల యొక్క పరిస్థితి ఏమిటి అనేది. 13 లక్షలు ఉద్యోగులు ఉన్నటువంటి ఈ రెండు జేఏసీలతో పాటుగా ఒక్కో ఉద్యోగికి అయిదు ఓట్లు అమ్మ, నాన్న, భార్య, భర్త, బిడ్డ 5 ఇంటు 13 లక్షలు సుమారు 60 లక్షల మంది ప్రభుత్వాన్ని కూల్చవచ్చు. ప్రభుత్వాన్ని నిలబెట్టవచ్చు., కాబట్టి ఉద్యోగుల శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే. ఈ రోజు ఉద్యమాలు చేస్తునటువంటి రైతులకు ప్రధాన మంత్రి సైతం దండం పెట్టి తప్పు అయిపోయిందని చెంపలు వేసుకున్నారు రైతుల దీక్షలతో. ఒక్క కాకి చచ్చిపోతే వంద కాకులు వస్తాయి. ఈ రోజు నీవు చేసే ఉద్యమం నీకోసం నీ బిడ్డల కోసం భావి తరాలకు ఉద్యమం ఎలా ఉండాలనేది చెప్పేదాని కోసం అంతే తప్ప నీ మోచేతి నీళ్లు తాగేటటువంటి పరిస్థితి కాదు. హక్కులను ఉద్యమం ద్వారానే తెచ్చుకుంటాం తప్ప నీ దయా దాక్షిణ్యాల మీద కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించే పరిస్థితి వచ్చింది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

జీతాన్ని ఒకటవ తారీకు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిదికాదా అని ప్రశ్నించారు. గతంలో జీతం రావడం లేదని కలెక్టర్ కు టెలిగ్రామ్ ఇస్తే వెంటనే డ్రాయింగ్ ఆఫీసర్ ను గందరగోళం చేసే వారు. కానీ ఈ రోజు చచ్చిపోతున్నామన్నా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగికి జీతం అనేది రాజ్యాంగంలో పొందుపర్చిన హక్కు అని అన్నారు. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే పాల వాళ్ల దగ్గర,
కూరగాయల వాళ్ల దగ్గర లోకువ అయిపోయామన్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగి ఉంటే గర్వంగా ఉండేది కానీ ఈ రోజు దారుణంగా తయారైందని బండి శ్రీనివాసరావు అన్నారు.


Share

Related posts

అఖిలప్రియ కు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు..!!

somaraju sharma

రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అవ్వబోతోన్న జూనియర్ ఎన్‌టి‌ఆర్ .. !

Naina

రిజర్వేషన్ల బిల్లులో సవరణలు కోరండి

Siva Prasad