Naga Chaitanya: సమంత అండ్ నాగ చైతన్య వీళ్ళద్దరి జంట చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేమించి మరి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కానీ వీళ్ళ ప్రేమ, పెళ్లి కొన్నాళ్లకే పెటాకులు అయిపోయాయి. ఇటీవలే వీరిద్దరూ తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ విడాకులు కూడా తీసుకున్నారు. అయితే వీరు విడాకులు విషయం తెలిసి అభిమానులు ఎంతగానో బాధపడ్డారు. ఇదిలా ఉండగా అసలు వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారో అనే విషయం పట్ల ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరి విడాకుల గురించి ఎన్నో రకాల రూమర్స్ హల్ చల్ చేసాయి.
Naga Chaitanya: మొదటిసారి విడాకుల గురించి నోరు విప్పిన నాగ చైతన్య.. ఏమ్మన్నాడంటే..?
విడాకులు అయ్యి ఇన్నాళ్లు అవుతున్నా గాని ఈ అంశంపై నాగచైతన్య ఇప్పటివరకు స్పందించలేదు. కానీ తాజాగా నాగ చైతన్య వారి విడాకుల విషయంపై కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించడం జరిగింది. మేము ఇద్దరం కూడా పరస్పర అంగీకారంతోనే విడాకుల నిర్ణయం తీసుకున్నామని చైతూ చెప్పాడు. విడాకుల అనంతరం కూడా సమంత చాలా సంతోషంగా ఉందని, ఆమెతో పాటు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నానని చైతూ చెప్పుకొచ్చాడు.అంతేకాకుండా మేము ఈ నిర్ణయం తీసుకోవడం తమ ఇద్దరికీ కూడా బెస్ట్ డెసిషన్ అని చెప్పాడు.
ఇద్దరి అంగీకారంతోనే విడాకులా.. లేక..?
అంటే నాగ చైతన్య, సమంత ఇద్దరూ కూడా ఇష్టప్రకారమే విడాకులు తీసుకున్నట్లు, తమ మధ్య ఇలాంటి బేదాభిప్రాయాలు లేవంటూ చెప్పకనే చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. నాగ చైతన్య మాటలు విన్నా అభిమానులు మావాడు బంగారం అంటూ మెచ్చుకుంటున్నారు.. ఇలాంటి వాడిని ఎలా వదులుకున్నావ్ సామ్ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కెరీర్ విషయానికి వస్తే?
ఇక వీరి సినీ జీవిత విషయానికి వస్తే సమంత తెలుగు, తమిళ, బాలీవుడ్ సినిమాలను ఒప్పుకుంటున్న కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ముంబైలో సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తోంది. తాజాగా సమంత నటించిన పుష్ప సినిమాలోని స్పెషల్ సాంగ్ మంచి హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక నాగచైతన్య విషయానికి వస్తే.. ‘బంగార్రాజు’ సినిమాలో తన తండ్రి నాగార్జునతో కలిసి నటించాడు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరించనుందో వేచి చూడాలి.
Nagarjuna: విడిపోయినా పర్వాలేదు.. చై-సామ్‌ల విడాకులపై నాగ్ కామెంట్స్ వైరల్
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!