Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ప్రేమమ్ అనే మలయాళ చిత్రంతో సినీ రంగప్రవేశం చేసిన అనుపమ.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన `అ ఆ` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత `శతమానం భవతి` సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ బ్యూటీ.. ఉన్నది ఒక్కటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యు, హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయినా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.
ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే అనుపమ.. ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫొటో షూట్లతో కుర్రకారు గుండెల్లో చిత్రహింస చేస్తుంటుంది. తాజాగా కూడా ట్రెండీ ఫ్రాక్ ధరించిన ఈ ముద్దుగుమ్మ కొంటె చూపులతో కిర్రాక్‌గా ఫొటోలకు పోజులిచ్చింది.
ఆపై అందుకు సంబంధించిన పిక్స్‌ను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. మతిపోగొడుతున్న అనుపమ తాజా ఫొటోలు ప్రస్తుతం నెటిజన్లును ఆకట్టుకుంటూ తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఆ ఫొటోలను ఓ చూపు చూసేయండి.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!