NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Big Breaking: మళ్ళీ మూడు రాజధానులు బిల్లు.. అసెంబ్లీలో ఎప్పుడంటే..!?

ap govt readying for 3 capitals

Big Breaking: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం మూడు రాజధానుల అంశం. టీడీపీ హయాంలో రాజధానిగా ప్రకటించిన అమరావతిని కలుపుతూ.. వైసీపీ ప్రభుత్వం మరో రెండు ప్రాంతాలను కలిపి మూడు రాజధానులను ప్రకటించింది. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అయితే.. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర వివాదం చెలరేగింది. వైసీపీ మినహా రాజకీయ పార్టీలన్నీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. రాజధానికి భూములిచ్చిన రైతులు దాదాపు రెండేళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఈ కేసు నడుస్తోంది. అయితే.. అనూహ్యంగా ఈ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ లో వెనక్కు తీసుకుంది. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఈ బిల్లును ప్రవేశపెడుతోందని తెలుస్తోంది.

ap govt readying for 3 capitals
ap govt readying for 3 capitals

అసెంబ్లీ సమావేశాల్లోనే..

మూడు రాజధానుల బిల్లుపై రగడ కొనసాగుతున్నా ప్రభుత్వం ముందుకే వెళ్లింది. విశాఖపట్నంలో కార్యాలయాలు సైతం ఇందుకు అన్వేషించింది. ఎప్పటికప్పుడు మంత్రులు, వైసీపీ ముఖ్యనేతల నుంచి.. ‘ఏ క్షణానైనా విశాఖకు రాజధాని తరలింపు’ అనే ప్రకటనలు కూడా వచ్చాయి. అయితే.. ఈ బిల్లును వెనక్కి తీసుకుంటున్నటు హైకోర్టుకు విన్నవించి సంచలనం రేపింది. అనంతరం.. అందరికీ ఆమోదయోగ్యమైన బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించింది. ఇప్పుడు ఇందుకు ముహూర్తం కుదిరిందని సమాచారం. మార్చి మొదటి వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా కారణంగా శీతాకాలపు సమావేశాలు కూడా సరిగా నిర్వహించని కారణంగా ఈసారి దాదాపు వారం నుంచి 15 రోజులు నిర్వహాంచాలని భావిస్తోంది.

పార్టీలు, రైతులు మాట ఇదే..

ఈ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. అయితే.. ఈసారి ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాజధాని మార్పును రాజకీయ పార్టీలేవీ అంగీకరించడం లేదు. భూములిచ్చిన రైతులు కూడా అమరావతిలోనే రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. మరి.. ఇటువంటి పరిస్థితుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం అనేది ప్రభుత్వానికి సవాల్ గా మారింది. అసలు.. రాజధాని మార్చేందుకే వీల్లేదని అంటున్న వర్గాలను ప్రభుత్వం నిజంగా ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్నా ఒప్పంచడం కష్టమే. మరి.. తన ముందున్న క్లిష్టమైన సమస్యను ప్రబుత్వం ఎలా ఎదుర్కొంటుందో.. రాజధానిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో..!

 

 

Related posts

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju