LIC: LIC తాజాగా IPOకి వెళ్లేందుకు సిద్ధమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ IPOలో పాల్గొనే పాలసీదారులకు LIC ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించడం ఆనందించదగ్గ విషయం. IPOలో వీరికోసం 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది LIC కంపెనీ. ప్రభుత్వం ఈ వారం DRHP (ముసాయిదా రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్) లేదా ఆఫర్ డాక్యుమెంట్ను ఫైల్ చేయడానికి రెడీగా వున్నందువలన LIC IPO దాని మిలియన్ల కొద్దీ పాలసీదారులకు తగ్గింపుతో రావచ్చునని DIPAM (డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్) సెక్రటరీ తుహిన్ కాంత పాండే అన్నారు.
Big Breaking: మళ్ళీ మూడు రాజధానులు బిల్లు.. అసెంబ్లీలో ఎప్పుడంటే..!?
LIC: నిబంధనలు వర్తిస్తాయి..
రిటైల్ విండో కింద పాలసీదారులకు ఖచ్చితమైన రిజర్వేషన్ కేటాయించనున్నారు. LIC చట్టం ప్రకారం 10% వరకు ఇష్యూని పాలసీదారులకు పోటీ ప్రాతిపదికన కొంత తగ్గింపుతో అందించవచ్చని, దానికి కావల్సిన నిబంధనలు రూపొందించినట్లు తెలుస్తోంది. అలాగే పాలసీదారులకే కాకుండా సంస్ధ ఉద్యోగులకు కూడా ఇందులో రిజర్వేషన్ ఉంటుందని చెబుతున్నారు. ఇక రిటైల్ పెట్టుబడిదారులు, ఉద్యోగులకు కూడా కొంత రాయితీని ఉంటుందని అంటున్నారు. అయితే వారికి ఇచ్చే తగ్గింపు వివరాలు ఇవ్వడానికి పాండే నిరాకరించినట్టుగా సమాచారం.
Hair Oil: ఈ నూనె రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరగడానికి ఖాయం..!!
సామాన్యుల భాగస్వామ్యం ఎంత?
LIC ప్రతిపాదిత IPOలో సామాన్యులను భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం సముఖంగా వున్నందువలన చిన్న పెట్టుబడిదారులు కూడా డిస్కౌంట్స్ పొందే అవకాశం మెండుగా ఉంది. అందువల్ల IPOలో 5% నుంచి 10% మధ్య వారికి కేటాయింపు వుండే అవకాశం ఉంటుందని కొందరు సలహాదారులు భావిస్తున్నారు. కాబట్టి మిత్రులారా ఈ సదవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ వచ్చే అవకాశం వుంది కనుక ఇప్పుడే మంచి నిర్ణయం తీసుకోండి.