NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CMO: ఆ కీలక పోస్టులోకి వచ్చే దెవరంటే..?

AP CMO: సీఎంవో కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఆయనను ప్రభుత్వం ఢిల్లీ ఏపి భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా ఎవరు నియామకం అవుతారన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ప్రవీణ్ ప్రకాష్ స్థానంలో మరో సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించే అవకాశం ఉన్నందున ఆ అధికారి ఎవరు అన్న చర్చ సచివాలయ వర్గాల్లో నెలకొంది.

AP CMO secretary post
AP CMO secretary post

AP CMO:  ప్రవీణ్ ప్రకాష్ స్థానంలో..

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. ఇప్పటి వరకూ సీఎం జగన్ పూర్తి స్థాయిలో అధికారులపైనే ఆధారపడ్డారు. దీంతో వారు లీగల్ ఒపీనియన్ లు తీసుకోకుండా ఇష్టానుసారంగా జారీ చేసిన  అనేక ప్రభుత్వ ఉత్తర్వులు వివాదాస్పదం అయ్యాయి. న్యాయసమీక్షలో నిలవలేదు. హైకోర్టు అనేక ఉత్తర్వులను కొట్టేసింది. ఇది ఒక విధంగా ప్రభుత్వానికి మచ్చగానే నిలుస్తోంది. సాధారణంగా ఇటువంటి వ్యవహారాలు సీఏంఒ కార్యదర్శి చూసుకోవాలి. అందుకే ఇప్పటి వరకూ జరిగిన తప్పులు జరగకుండా ప్రవీణ్ ప్రకాష్ స్థానంలో సమర్ధవంతమైన మరో సీనియర్ ఐఏఎస్ అధికారిని ఆ పోస్టులో నియమించాలని సీఎం జగన్ భావిస్తున్నారని సమాచారం.

 

టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి కే చాన్స్..?

ఈ రెండున్నర సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వానికి కీలకం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు విమర్శల పాలు కాకుండా చూసుకోవాలి. ఈ తరుణంగా సీఎంవో కార్యదర్శి పదవికి ప్రస్తుతం టీటీడీ ఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న జవహర్ రెడ్డి  పేరు పరిశీలిస్తున్నారని సమాచారం. మరో సీనియర్ అధికారిణి శ్రీలక్ష్మి పేరు కూడా పరిశీలనకు వచ్చినా ఆమెను నియమిస్తే రాజకీయపరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నారుట. ప్రస్తుతం సచివాలయ వర్గాల్లో మాత్రం జవహర్ రెడ్డి పేరు వినబడుతోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella