Bheemla nayak: త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా సినిమాలు చేసినప్పటి నుంచి కొన్ని పాత్రల విషయంలో సెంటిమెంట్‌ను అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఒకసారి తన దర్శకత్వంలో సినిమా చేసిన హీరోయిన్‌తో మళ్ళీ మళ్ళీ సినిమా చేయడం. అలాగే, తను రాసుకున్న పాత్రలకు పూర్తి న్యాయం చేస్తున్న ప్రముఖ నటులను రిపీట్ చేయడం. ముఖ్యంగా కామెడీ కింగ్ బ్రహ్మానందం. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అతడు సినిమాలో అందరికంటే బాగా హైలెట్ అయింది బ్రహ్మానందం పోషించిన పాత్ర. ఈ సినిమా ఎపుడు టీవీలో వచ్చిన కడుపుబ్బా నవ్వుకుంటారు. అలాగే, జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలలో బ్రహ్మీ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటాయి.
త్రివిక్రమ్ సినిమాలో బ్రహ్మీ ఎంట్రీతోనే ప్రేక్షకులు నవ్వులు మొదలుపెడతారు. ఇక డైలాగ్స్ చెబుతూ.. పర్ఫార్మెన్స్ చేస్తుంటే థియేటర్స్ నవ్వులతో దద్దరిల్లిపోతాయి. అలాంటి బ్రహ్మీ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. కరోనా వేవ్స్ మొదలైనప్పటి నుంచి దాదాపుగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ముందు ఈ సినిమాలో బ్రహ్మీ పాత్ర లేదు. మలయాళం వెర్షన్ అయ్యప్పనుమ్ కోషియుమ్ లో కూడా ఈ పాత్ర ఉండదు. కానీ, తెలుగులో బ్రహ్మానందం సినిమా చేస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక త్రివిక్రమ్ ఓ పాత్రను క్రియేట్ చేశారు.
Bheemla nayak: బ్రహ్మీ ఎలా నవ్విస్తారో.
భీమ్లా నాయక్ సినిమాలో ఆయనది ఫారెస్ట్ ఆఫీసర్ పాత్ర అని సమాచారం. ఈ పాత్రతో మళ్ళీ బ్రహ్మీ తన సత్తా చాటతారని చిత్రయూనిట్ చాలా నమ్మకంగా చెబుతోంది. పవన్ – రానా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీలో త్రివిక్రమ్ గత చిత్రాలలో హైలెట్ అయినట్టుగానే భీమ్లా నాయక్ సినిమాలోనూ హైలెట్ అవుతుందట. తన సెంటిమెంట్ ప్రకారం ఈ పాత్రను చాలా అద్భుతంగా రాసినట్టు చెబుతున్నారు. చూడాలి మరి కాస్త లాంగ్ గ్యాప్ తర్వాత భీమ్లా నాయక్ సినిమాలో కనిపించబోతున్న బ్రహ్మీ ఎలా నవ్విస్తారో. కాగా, ఈ సినిమాను ఇదే వారం ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. పవన్ – నిత్యా మీనన్, రానా – సంయుక్త మీనన్‌ల జంట బాగా ఆకట్టుకుంటుందని మేకర్స్ అంటున్నారు.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!