NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

MP RRR: వెంటాడుతున్న అరెస్టు భయం..! ఏపి పోలీసులను చూసి ఎంపి రఘురామ ఏమి చేశారంటే..?

MP RRR: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజుకు సీఐడీ అరెస్టు భయం వెంటాడుతోంది. ఏపి ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ని, ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన రఘురామ కృష్ణంరాజుపై ఇంతకు ముందు రాజద్రోహం తదితర సెక్షన్ ల కింద ఏపి సీఐడీ కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఆ తరుణంలో సీఐడీ అధికారుల కస్టడీలో తనపై భౌతిక దాడి జరిగిందనీ ఆరోపించడం, సుప్రీం కోర్టు ద్వారా స్టే తీసుకోవడం విదితమే. సంక్రాంతి పండుగ ముందు ఏపి సీఐడీ అధికారులు హైదరాబాద్ లోని రఘురామ నివాసానికి వెళ్లి విచారణకు హజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.

MP RRR fears arrest by AP CID
MP RRR fears arrest by AP CID

MP RRR: రఘురామ ఇంటి వద్దకు ఏపీ సీఐడీ పోలీసులు

అయితే ఆ విచారణకు పిలిచి మరో కేసులో అరెస్టు చేస్తారన్న భయంతో రఘురామ కృష్ణం రాజు నర్సాపురం పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లిపోయారు. అదే సమయంలో రఘురామ కృష్ణంరాజుపై ఏపిలో సీఐడీ డీజీ సునీల్ కుమార్ ను దూషించారన్న అభియోగంపై కేసు నమోదు అయ్యింది. దానిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా స్టే మంజూరైంది. అయితే సీఐడీ విచారణకు అప్పటి నుండి రఘురామ కృష్ణంరాజు హజరు కాలేదు. తన ఆరోగ్యం బాగాలేదని పేర్కొంటూ విచారణకు హజరు అయ్యేందుకు సమయం కావాలంటూ ఏపీసీఐడీకి రఘురామ లేఖ రాశారు. అయితే నెల రోజులు గడచి పోవడంతో ఏపీ సీఐడీ అధికారులు నిన్న మరో సారి హైదరాబాద్ లో రఘురామ ఇంటి వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది.

పోలీసుల కళ్లు కప్పి ఢిల్లీకి

హైదరాబాద్ లో ఆర్ ఎస్ఎస్ నేత దత్తాత్రేయ హాస్బోలే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రఘురామ కృష్ణంరాజు వచ్చారు. తన నివాసం సమీపంలో ఏపి పోలీసులు నిఘా పెట్టిన విషయం తెలుసుకున్న రఘురామ కృష్ణంరాజు వారి కళ్లు కప్పి ఢిల్లీకి వెళ్లిపోయారు. పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయని సీఐడీ అధికారులకు లేఖలో పేర్కొన్నప్పటికీ తనను అరెస్టు చేసేందుకు ఇంటి వద్ద ఏపి పోలీసుల నిఘా పెట్టారంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు రఘురామకృష్ణం రాజు లేఖ రాశారు. రఘురామపై ఇంతకు ముందు కూడా పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి. వాటిపైనా ఆయన కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అయినప్పటికీ అరెస్టు భయంతో ఆయన ఏపికి రావడం లేదు. దాదాపు రెండు సంవత్సరాలుగా రఘురామ తన నియోజకవర్గంలోనూ అడుగుపెట్టడం లేదు.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju