NewsOrbit
న్యూస్ సినిమా

Bheemla nayak: వరుసగా పోలీసు కేసులు …మేకర్స్ రియాక్ట్ అవరా..?

Bheemla nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘భీమ్లానాయక్’ గత వారం విడుదలై సంచలనాలను సృష్టిస్తోంది. చాలా ఏళ్ళ తరువాత పవన్ కళ్యాణ్ మాసీవ్ రోల్‌లో నటించడంతో అభిమానులే కాదు అన్నీ వర్గాల ప్రేక్షకులు ఈ మూవీ చూసి సంబరపడుతున్నారు. దర్శక, రచయిత త్రివిక్రం పవన్ కళ్యాణ్ పాత్రను మలిచిన విధానం ప్రతీ ఒక్కరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘గబ్బర్ సింగ్’ మూవీ తర్వాత తరువాత మళ్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంతకు మించి రేంజ్‌లో భీమ్లానాయక్ మూవీ టైటిల్ రోల్‌లో తన చూపించారు.

bheemla-nayak-makers are not reacting for cases
bheemla-nayak-makers are not reacting for cases

పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా నటించడంతో థియేటర్ల వద్ద సందడి మామూలుగా ఉండటం లేదు. మలయాళ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి పూర్తి భిన్నంగా తెలుగులో మార్పులు చేర్పులు చేసిన భీమ్లానాయక్ అఖండ విజయాన్ని సాధించడమే కాదు.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ బ్రేకీవెన్‌ ను దాటిపో తోంది. ఇంత భారీ సక్సెస్ అందుకున్న ఈ మూవీ పై పోలీసు కేసు నమోదవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Bheemla nayak: మరి దీనిపై చిత్రబృందం ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇందులో పవన్, రానా పాత్రలు నువ్వా నేనా అన్నట్టు పోటా పోటీగా ఉంటాయి. ఇద్దరి మధ్య యాక్షన్ సీక్వెన్స్ కూడా ఓ రేంజ్‌లో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఓ ఫైట్‌లో రానా కుమ్మరి చక్రాన్ని కాలుతో తంతాడు. ఇదే ఇప్పుడు సమస్యలను తెచ్చిపెట్టింది. ఈ సన్నివేశాన్ని తొలగించాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. భీమ్లా నాయక్‌ మూవీలో కుమ్మరి కులస్థుల ఆత్మగౌరవం దెబ్బతినేలా ఉన్నటువంటి సన్నివేశాలను వెంటనే తొలగించాలంటూ లాలాపేట్‌ పోచమ్మ దేవాలయ సభ్యుడు ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. మరి దీనిపై చిత్రబృందం ఎలా స్పందిస్తారో చూడాలి.

Related posts

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri