NewsOrbit
న్యూస్ సినిమా

Top Heroine Marriage : త్వరలో పెళ్లిపీటలెక్కనున్న టాప్ హీరోయిన్?

Top Heroine Marriage : చాలా మంది హీరోయిన్లు తమ హవా నడుస్తున్న సమయంలో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసేస్తారు. ఆ తర్వాత వయసు మీద పడుతున్న తరుణంలో పెళ్లి చేసుకుని స్థిరపడుతున్నారు. పెళ్లి తర్వాత కొందరు ఇండస్ట్రీకి దూరమవుతుండగా, మరి కొందరు తల్లి, సోదరి వంటి పాత్రలతో అలరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారుతోంది. కెరీర్‌ పీక్ దశలో ఉండగానే హీరోయిన్లు పెళ్లి చేసుకుంటున్నారు. ఆ తరువాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇదే కోవలో ప్రముఖ హీరోయిన్ తాప్సీ పన్ను కూడా నడవనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆమె పెళ్లి పీటలెక్కనుందని, ఆమె ప్రియుడితో వివాహానికి కుటుంబం కూడా సమ్మతి తెలిపిందని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Top Heroine Marriage: బాలీవుడ్‌లో పాగా

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం చిత్రం ద్వారా ఆమె సినీ రంగ ప్రయాణం ప్రారంభించింది. ఈ క్రమంలో తెలుగులో అగ్రహీరోల సరసన నటించింది. తెలుగులో అవకాశాలు సన్నగిల్లుతున్న సందర్భంలో బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ, టాప్ హీరోయిన్‌గా నిలదొక్కుకుంది. హసీనా దిల్ రూబా, తప్పడ్, పింక్, ముల్క్, బదలా వంటి ఎన్నో విభిన్న, వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకతను నిలుపుకుంది. ఓ వైపు సినిమాలు చేస్తుండగానే మరో వైపు ప్రముఖ విదేశీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్‌తో పెళ్లికి సిద్ధమవుతోందని సమాచారం.

కుటుంబం నుంచి గ్రీన్ సిగ్నల్

ఐపీఎల్, ప్రొ కబడ్డీ మాదిరిగానే కొంత కాలం క్రిందట బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్‌ను భారత దేశంలో నిర్వహించారు. వివిధ జట్ల నుంచి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు పోటీ పడ్డారు. ఆ తరుణంలో ఓ జట్టుకు ప్రచారకర్తగా వ్యవహరించింది తాప్సీ. ఈ క్రమంలో విదేశీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్‌తో పరిచయం ఏర్పడింది. అది కొంత కాలానికి వారి మధ్య ప్రేమగా మారింది. వీరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకారం తెలిపారు. ఓ వైపు తీరిక లేకుండా సినిమాలు చేసే తాప్సీ, ఏ మాత్రం అవకాశం దొరికినా మథియాస్‌తో కలిసి విహార యాత్రలకు వెళ్లేదు. ఈ తరుణంలో త్వరలో వారి పెళ్లికి కుటుంబ పెద్దలు డేట్ కూడా నిశ్చయించారని, దీంతో వారిద్దరూ వివాహం ద్వారా ఒక్కటి కానున్నారని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

Related posts

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri