Health Benefits: వేసవి కాలం వచ్చేసింది. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఎండలు కొన్నిచోట్ల నమోదవుతున్నాయి. ఇటువంటి తరుణంలో మన దైనందిన జీవితంలో… మన శరీరం చాలా కూల్ గా ఉండాలంటే తీసుకోవాల్సిన తినుబండారాలు. వేసవిలో శరీరం చాలా వేడికి గురవుతుంది. దీంతో ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. శరీరానికి అధిక శక్తి ఇచ్చే మందులు మరియు కొన్ని ప్రొటీన్ల వల్ల కూడా శరీరం వేడి కి గురవుతుంది. ఈ తరుణంలో శరీరం వేడి చేసే తత్వం ఉన్నవాళ్ళు పులుపు,
అల్లంవెల్లుల్లి వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. పుచ్చకాయ, కర్బూజ, దానీమ్మ, కమల, కీరా దోస… ఈ ఆహారాలు వేడిని తగ్గించడం లో ప్రముఖంగా పనిచేస్తాయి. ఇక ద్రవపదార్థాల విషయానికొస్తే కాఫీ, టీ, ఆల్కహాల్ వేడిని పెంచేస్తాయి. మజ్జిగ చాలా చలవ చేస్తుంది. ఉప్పు, పులుపు, కారం రుచులు శరీరంలో వేడిని పెంచుతాయి. తీపి, వగరు, చేదు చలవ. క్యారెట్ ముల్లంగి… ఆపిల్ లేదా కర్బూజ.. లేదా పుచ్చకాయ.. ఈ మూడింటిని సమానంగా తీసుకొని జ్యూస్ తీసుకుని … రోజూ ఒక గ్లాసు చొప్పున తీసుకుంటే… ఒంట్లో వేడి తగ్గిపోతుంది.
ఇక ఇదే సమయంలో నోరు ఆరిపోకుండా అప్పటి కప్పుడు నీళ్ళు తీసుకోవడం మంచిది. రేషన్ కాలంలో శరీరం ఎక్కువ డీహైడ్రేషన్ కాకుండా.. శరీరాన్ని ఎక్కువ అలసటకు గురి చేయకుండా… మనకి మనమే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ధనియాలు, శొంఠి, జీలకర్ర ఈ మూడింటినీ సమానంగా తీసుకుని… మెత్తగా దంచిన పొడి… ఒక టీస్పూన్ మోతాదులో గ్లాస్ మజ్జిగలో.. రోజు తాగితే… శరీరంలో వేడి నార్మల్ అయిపోతుంది. శరీరంలో వేడి చేసే గుణం కలిగిన వాళ్లు పొద్దున టిఫిన్ కంటే… మజ్జిగ అన్నం తినటం చాలా శ్రేష్టం. సబ్జ గింజలు నీళ్లలో నానబెట్టుకుని… నీళ్ళతో సహా తాగితే కూడా బాడీ మంచి కూల్ అవుతోంది.