NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Ganta Srinivasarao: ఎమ్మెల్యే గంటా ఫర్ఫెక్ట్ వ్యూహం..! జనసేన లోకి ఒక ప్లాన్ ప్రకారమే.. కానీ..!?

Ganta Srinivasarao: ఏపి రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురించి పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. ఆయన చేసే రాజకీయాలు ఏ నాయకుడు చేయరు. అటువంటి వ్యూహాలు ఏ నాయకుడు వేయరు. ఆయనకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. ? ఒక పార్టీలో స్థిరంగా ఉండరు..! ఒక నియోజకవర్గంలో స్థిరంగా ఉండరు..! నిజానికి రాజకీయ నాయకులు రెండు రకాలు ఉంటారు. ప్రజల కోసం నా నియోజకవర్గమే ముఖ్యం. నేను గెలిచినా ఓడిపోయినా ఇదే నా నియోజకవర్గం అని అంటి పెట్టుకుని ఉంటాను. నాకు పార్టీలు అనవసరం, అధికారం అనవసరం. నా ముద్ర నియోజకవర్గంలో శాశ్వతంగా ఉండాలి అనుకునే నాయకులు కొంత మంది ఉంటారు. ఇటువంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. గతంలో వామపక్షాల్లో ఉండే వారు. ఇప్పుడూ అటువంటి వారు తగ్గుతూ వచ్చారు. రెండవ రకం నాయకులు స్ట్రాటజీ ఏమిటంటే పార్టీ ఏదైనా అవ్వనే. ఏ నియోజకవర్గం అయినా ఫరవాలేదు. పార్టీకి సంబంధం లేదు. నియోజకవర్గానికి సంబంధం లేదు. నాకు ఎమ్మెల్యే పదవి ఉండాలి. ఆ పదవికి ఒక అధికారం ఉండాలి. ఆ అధికారంతో వచ్చే పెత్తనాన్ని జిల్లాలో, నియోజకవర్గంలో చూపించుకోవాలి. ఇది రెండో రకం రాజకీయం. ఇప్పుడు ఇటువంటి నాయకులు ఉంటారు. ఇటువంటి నాయకులకు స్పూర్తి ప్రదాత గంటా శ్రీనివాసరావు. పార్టీలు మారుతున్నా, నియోజకవర్గాలు మారుతున్నా గెలుస్తూ వస్తున్నారు అంటే అది ఆయన ప్రత్యేకత. దానికి ఎవరైనా అభినందించాల్సిందే.

Ganta Srinivasa Rao political strategy
Ganta Srinivasa Rao political strategy

Ganta Srinivasarao: ఒక ప్లానింగ్. ఒక స్ట్రాటజీ ప్రకారం

గంటా శ్రీనివాసరావు ఇప్పుడు కొత్తరకం వ్యూహం వేశారు. రీసెంట్ గా ఆయన అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ గతంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ లేఖ ఇచ్చాను, ఆ రాజీనామాను ఇంకా ఆమోదించలేదు. తన రాజీనామాను ఆమోదించండి అంటూ లేఖలో పేర్కొన్నారు. గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయాలని ఏ ఒక్కరైనా కోరారా..? విశాఖ ఉత్తరం నియోజకవర్గం వాళ్లు కానీ, లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులు గానీ ఉద్యోగులు కానీ, ఆయన అనుచరులు గానీ రాజీనామా చేయమని  ఏమైనా కోరారా..? అంటే లేదు. ప్రజాభిప్రాయం మీద తాను రాజీనామా చేశాను అంటే ఆ ప్రజలు ఎవరో చూడవచ్చు. అటు ప్రజలు, ఇటు కార్మికులు ఎవ్వరూ కోరకుండా ఆయన ఎందుకు రిజైన్ చేశారు అంటే.. ఆయనది ఒక ప్లానింగ్. ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆయన రాజీనామా లేఖ ఇచ్చిన తరువాత తన సామాజికవర్గాన్ని ఏకం చేసే పనిలో ఉన్నారు. వారానికి ఒక సారి తన సామాజికవర్గ నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. జేడి లక్ష్మీనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, గంగాధర్ ఇలా చాలా మంచి తో సమావేశం అవుతున్నారు. దానికి ఒక ఫోరంగా పేరు పెట్టారు. దాన్ని గంటా శ్రీనివాసరావు నేతృత్వం వహిస్తున్నారు.

అధికారం లేనప్పుడు ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకపోయినా ఒక్కటే

ఇది ఎందుకు అంటే..? సామాజికవర్గం తన వెనుక ఉంది అని సిగ్నల్ ఇవ్వడానికి. సామాజిక రాజకీయాలు చేయడానికి ఎమ్మెల్యే పదవికి ఆయనకు అడ్డేమీ కాదు. కాకపోతే ఎమ్మెల్యేగా రిజైన్ చేస్తే ఒక బలమైన కారణం చూపించవచ్చు. అదుగో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రిజైన్ చేశాను. నేను ప్రజల కోసమే రిజైన్ చేశాను, నాకు పదవి ముఖ్యం కాదు అని చెప్పుకుని జనంలోకి వెళ్లడానికి కారణం (రీజన్) దొరుకుతుంది. ఆయనకు ఎమ్మెల్యే పదవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒక్కటే. పదవి ఉంటే అధికారం కావాలి. ఆ అధికారం లేనప్పుడు ఈ పదవి ఉన్నా లేకపోయినా ఒక్కటే అన్నది ఆయన అభిప్రాయం. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉండటం వల్ల ఆ నియోజకవర్గంలో హావా నడవదు. అక్కడ అధికార పార్టీ ఇన్ చార్జి మాటకే ఎక్కువ విలువ ఉంటుంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటే ఒక్క విఆర్ఓ గానీ ఒక్క కానిస్టేబుల్ ను కూడా మార్చే అవకాశం ఉండదు. అందుకే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అదే అధికార పార్టీలో ఉంటే రిజైన్ చేయలేరు. ఇలా మాట్లాడలేరు. సామాజిక ఐక్యత పేరుతో రాజకీయాలు చేయలేరు కదా..!

Ganta Srinivasarao: జనసేనలోకి..?

2019కు ముందు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు తన సామాజికవర్గం గుర్తుకు రాలేదా.. ? సామాజికవర్గ రాజకీయ వేదికలు గుర్తుకు రాలేదా..? ఇదంతా ఎందుకు అంటే.. గంటా శ్రీనివాసరావు ఏమి చేసినా ఒక వ్యూహం, ఒక బలమైన స్ట్రాటజీ ఉంటుంది. ఆ వ్యూహం ఏమిటంటే..? ప్రజల కోసమే రాజీనామా చేశానని జనాల్లోకి వెళ్లడానికి. సామాజికవర్గం మొత్తం తన వెనుక ఉంది, తాను సామాజికవర్గ పెద్దను అని చెప్పి భవిష్యత్తులో తాను వెళ్లబోయే పార్టీతో నెగోషియేషన్ చేసుకుని తన వర్గీయులకు టికెట్లు ఇప్పించుకోవడం. మరల టీడీపీలోనే కొనసాగవచ్చు, లేదా జనసేనలో ఎక్కువ సీట్లు ఇస్తామంటే వెళ్లవచ్చు. వైసీపీకి వెళ్లేందుకు మాత్రం అవకాశం లేకపోవచ్చు, ఏడాదిన్నర క్రితమే ప్రయత్నాలు చేశారు గానీ వర్క్ అవుట్ కాలేదు. ఆ దారి మూసుకుపోయింది. వేరే పార్టీలోకి వెళ్లడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మంచి ముద్ర కోసమే రాజీనామా, సామాజికవర్గ వేదిక అని చెప్పుకోవచ్చు. ఇంతకు మించి వేరే వ్యవహారం ఏమి ఉండకపోవచ్చు.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N