RRR: “బాహుబలి” లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “ఆర్ఆర్ఆర్” నేడు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా అన్నిచోట్ల బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడం జరిగింది. గ్యారెంటీగా “ఆర్ఆర్ఆర్”…” బాహుబలి” రికార్డులను బ్రేక్ చేయడం జరుగుతుందని ట్రేడ్ వర్గాల అంచనా. “ఆర్ఆర్ఆర్” ఓపెనింగ్ కలెక్షన్లు రికార్డు స్థాయిలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా బాగుండటంతో ప్రముఖులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా గురించి.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఆర్ఆర్ఆర్” బృందానికి అభినందనలు తెలియజేశారు.
హీరోలు చరణ్, ఎన్టీఆర్ అదేవిధంగా డైరెక్టర్ రాజమౌళి నీ చూస్తుంటే చాలా గర్వంగా ఉందని తెలియజేశారు. “ఆర్ఆర్ఆర్” తో కొత్త హద్దులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఒక ప్రకాష్ రాజ్ మాత్రమే కాదు… సినిమా చూసిన చాలా మంది ప్రముఖులు.. అద్భుతం అంటూ అభివర్ణిస్తున్నారు. కచ్చితంగా “ఆర్ఆర్ఆర్” టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు తిరగరాయడం గ్యారెంటీ అని చూసిన ప్రేక్షకులతోపాటు ప్రముఖులు కూడా లెక్కలు కడుతున్నారు.
అదే సమయంలో సినిమా చూసి టాప్ డైరెక్టర్ సుకుమార్, అనిల్ రావిపూడి.. “బాహుబలి” నిర్మాత శోబు యార్లగడ్డ ఇంకా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు రియాక్ట్ కావడం జరిగింది. ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాగా.. విడుదలైన “ఆర్ఆర్ఆర్” బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కొమరం భీమ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్.. ఎన్టీఆర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో… ఆడియన్స్ నీ అలరించడం జరిగింది. డైరెక్టర్ రాజమౌళి విజువల్ ఎఫెక్ట్స్ పరంగా సినిమాకి అద్భుతంగా న్యాయం చేయడం జరిగింది. పోరాట సన్నివేశాలు ఎన్టీఆర్- చరణ్ మధ్య ఉండే ఫ్రెండ్షిప్.. యాక్షన్ సన్నివేశాలు.. సినిమాకి హైలెట్ గా ఉండటంతో చాలా మంది ప్రముఖులు ఈ సినిమా చూసి తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు.
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!