NewsOrbit
న్యూస్

Breaking: హనుమాన్ శోభాయాత్రలో ఉద్రిక్తత .. దేశ రాజధాని ఢిల్లీలో భారీగా పోలీసుల మోహరింపు

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న శోభాయాత్రలో హింసాత్మక ఘటన చోటుచేసుకున్నాయి. వాయువ్య డిల్లీలోని జహాంగీర్ పుర్ ప్రాంతంలో హనుమాన్ జయంతి ఉరేగింపు జరుగుతున్న సందర్భంలో అల్లరిమూకలు రాళ్లు రువ్వడంతో హింస చెలరేగింది. ఈ దాడిలో పలువురు వ్యక్తులతో పాటు పోలీసులు గాయపడ్డారు. కొన్ని వాహనాలకు దుండగులు తగులబెట్టారు. ఈ ఘటనలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో మాట్లాడి హింసకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర హోంశాఖకు ఢిల్లీ పోలీసులు సమాచారం అందించారు. ఢిల్లీ పోలీసులకు కేంద్ర హోంశాఖ అవసరమైన ఆదేశాలు ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

Breaking Violence in Delhi Hanuman jayanti procession
Breaking Violence in Delhi Hanuman jayanti procession

 

ఈ అల్లర్లపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ప్రజలు అందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. లెప్టినెంట్ గవర్నర్ తో ఫోన్ లో మాట్లాడినట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. శాంతి భద్రతల కోసం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్తానా అన్నారు. పరిస్థితి అదుపులో ఉందనీ, జహంగీర్ పురి తో సహా ఇతర సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మొహరించినట్లు చెప్పారు. సీనియర్ అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండి శాంతి భద్రతలను నిశితంగా పర్యవేక్షిస్తూ పెట్రోలింగ్ చేపట్టాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో పుకార్లు, తప్పుడు వార్తలను పౌరులు పట్టించుకోవద్దని రాకేశ్ అస్తాన్ పేర్కొన్నారు. అల్లరి మూకల దాడి ఘటనను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. ఘటనపై డిల్లీ పోలీస్ కమిషనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో చర్చించారు.

Related posts

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?