అమరావతి, ఏప్రిల్ 9: ప్రకాశం జిల్లా ఎస్ పి కోయ ప్రవీణ్ పై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.
ఎస్ పి ప్రవీణ్ అధికార టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వైసిపి నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
దీనిపై ఎన్నికల సంఘం కోయ ప్రవీణ్ ను బదిలీ చేస్తూ అతని స్థానంలో సిద్ధార్ద్ కౌసిక్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి సీఐలను కూడా బదిలీ చేసినట్లు సమాచారం.