NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS jagan: ఏపిలో భారీ విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్..ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే..?

CM YS jagan: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని బ్రహ్మణపల్లి – గుమ్మటం తండా వద్ద ఏర్పాటు చేస్తొన్న ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు పనులను ఏపి సీఎం వైఎస్ జగన్ మంగళవారం ప్రారంభించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎనర్జీ ప్రాజెక్టును గ్రీన్ కో గ్రూపు ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం గ్రీన్ కో గ్రూపు సంస్థ మూడు బిలియన్ యూఎస్ డాలర్లు పెట్టుబడిగా పెడుతుండగా, ఒకే యూనిట్ నుండి సోలార్, విండ్, హైడల్ పవర్ లను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.  ఈ ప్రాజెక్టు ద్వారా 5,230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. గ్రీన్ కో ఎనర్జీస్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే 2,800 ఎకరాలు కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది.

CM YS jagan lay foundation stone Largest power project Kurnool dist
CM YS jagan lay foundation stone Largest power project Kurnool dist

CM YS jagan: 5,410 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం

ఇంటిగ్రెటెడ్ పునరుత్పాదక ఇంథన ప్రాజెక్టులో భాగంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి 3వేల మెగావాట్లు, విండ్ పవర్ 550 మెగావాట్లు, హైడల్ పవర్ 1860 మెగావాట్లు ఉత్పత్తి చేస్తారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని రాబోయే అయిదేళ్లలో పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 23వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మొత్తం 5,410 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసి నేషనల్ గ్రిడ్ కు అనుసంధానించి ఓర్వకల్లు పీజీసీఐఎల్, సీటీయూ విద్యుత్ సబ్ స్టేషన్ ద్వారా దేశంలోని డిస్కమ్ లు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటారు. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ముందుగా సీఎం జగన్ పవర్ ప్రాజెక్టు త్రీడీ మోడల్ నమూనాను ప్రారంభించారు. అనంతరం పైలాన్ ను ఆవిష్కరించారు. తదుపరి కాంక్రీట్ వేసి ప్రాజెక్టు పనులను ప్రారంభించారు.

Read More: YSRCP Rajya Sabha: ఏపి వైసీపీ రాజ్యసభ స్థానాల్లో అనూహ్యంగా తెరపైకి కొత్త నేత పేరు..?

నిర్మాణ సమయంలోనే 15వేల మందికి ఉపాధి

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ కర్నూలులో హైడల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రెటెడ్ పునరుత్పాదక ఇంథన ప్రాజెక్టుకు కర్నూలు వేదిక కావడం గర్వకారమని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే 15వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. అయిదేళ్ల పాటు నిర్మాణ పనులు కొనసాగుతాయని తెలిపారు సీఎం జగన్.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju