NewsOrbit
Telugu TV Serials

Karthika Deepam: జ్వాలను అవమానించి నిరూపమ్ కు దూరం చేయడానికి శోభ పన్నిన కుట్ర..!

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో నిరుపమ్, జ్వాలతో కలిసి ఆశ్రమానికి వచ్చాడని తెలుసుకున్న స్వప్న అదేపనిగా నిరుపమ్‌కి కాల్ చేస్తుంది. ఎక్కడ ఉన్నావ్ అంటే ఆశ్రమంలో అని నిరుపమ్ సమాధానం చెప్పడంతో స్వప్న షాక్ అయ్యి ఆ ఆటోదానితో నీకేంటిరా పని అంటుంది.ఈరోజు కూడా అదే సీన్ కంటిన్యూ అవుతుంది. స్వప్న కోపంతో ఆ ఆటోదానితో దానితో నీకు స్నేహమేంట్రా?’అని నిరూపమ్ ను తిడుతుంది.దాంతో నిరుపమ్‌కి కోపం వచ్చి.. ‘ఆటో నచ్చితే ఆటోలో వెళ్తా.. అలాగే ఆటో వాళ్లు నచ్చితే వాళ్లతోనే స్నేహం చేస్తాను నాకు నచ్చినట్లు నేను ఉంటాను ఫోన్ పెట్టెయ్ మమ్మీ అంటూ విసుక్కుంటూ ఫోన్ కట్ చేస్తాడు. ఆ మాటలు విన్న జ్వాల తెగ సంతోషపడిపోతుంది.. ఇక ‘ఏం అయ్యింది డాక్టర్ సాబ్’ అని అంటుంది. ‘ఏం లేదులే జ్వాల. నా మనసేం బాలేదు.. మరోసారి కలుద్దాం బై’ అని చెప్పి నిరుపమ్ అక్కడ నుండి వెళ్లిపోతాడు.

karthika deepam latest episode
karthika deepam latest episode

జ్వాలను అవమానించే ప్లాన్ రెడీ చేసిన శోభ.!

సీన్ కట్ చేస్తే.. శోభ శాంతా బాయ్ ను కలుస్తుంది.శాంత బాయ్ జ్వాల వాళ్ళ పిన్ని బాబాయ్ ల గురించి శోభకు చెబుతుంది.ఏంటి ‘నువ్వు చెప్పేది నిజమేనా…నువ్వు సూపరంటే సూపరు’ అంటూ శాంతబాయ్ ను మెచ్చుకుంటుంది. ‘నిజమేనమ్మా.. ఆ జ్వాల పిన్నీ బాబాయ్‌లు దొంగతనం చేసుకునే బతికే వారట.. ఈ మధ్య వాళ్లు దొంగతనాలు మానేసి ఏవో వంటలు చేస్తున్నారట అని చెబుతుంది.ఇక వెంటనే శోభ.. ఒసేయ్ జ్వాలా కరెక్ట్‌గా దొరికావే నాకు.. దీన్ని వాడుకుని సరైన సమాధానం చెబుతాను.. నిన్ను నిరూపమ్ కు దూరం చేస్తాను అనుకుంటుంది.

karthika deepam latest episode
karthika deepam latest episode

ప్రేమ్ పంపిన సెల్ఫీ వీడియోను హిమ చూస్తుందా.?

మళ్ళీ సీన్ సౌందర్య వాళ్ళ ఇంట్లో ఓపెన్ అవుతుంది. హిమ ఇంట్లోకి రావడంతోనే ఆనందరావు, సౌందర్య ఇద్దరు కూడా హిమను నిజం చెప్పమని నిలదీస్తారు. మౌనంగా ఉంటున్నందుకు తిట్టిపోస్తారు.. అదే సమయంలో ప్రేమ్ తనుహిమకు ప్రపోజింగ్ చేసిన సెల్ఫీ వీడియోని పంపుతాడు.దేవుడా ‘నా ప్రేమ సక్సెస్ కావాలి’ అని కోరుకుంటూ ఉంటాడు.అయితే అప్పటికే కోపంగా ఉన్న హిమ నాన్నమ్మ తాతయ్యలకు ఏమి చెప్పాలో తెలియక చేతిలో ఉన్న ఫోన్ విసిరికొట్టి కోపంగా హిమ లోపలికి వెళ్లిపోతుంది. ప్రేమ్ మెసేజ్ హిమ చూడకుండానే ఫోన్ పగిలిపోతుంది.మరోవైపు ప్రేమ్ తన వీడియో మెసేజ్ హిమ చూసి ఉంటుందా లేదా అనే ఆలోచనలో పడతాడు రాత్రంతా నిద్రపోకుండా ఎదురు చూస్తాడు.

karthika deepam latest episode
karthika deepam latest episode

పార్టీకి జ్వాలను తీసుకురమ్మని హిమతో చెప్పిన శోభ:

సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం హిమ హాస్పెటల్‌లో ఉండగా శోభ హిమ ఫోన్‌కి కాల్ చేసి చిన్న పార్టీ ఉంది.. నువ్వు నిరుపమ్ కచ్చితంగా రావాలి. అలాగే ఆ ఆటో అమ్మాయి జ్వాలని కూడా రమ్మని చెప్పు అని అంటుంది. అలాగే ఈ పార్టీకి మీ స్వప్న అత్తయ్య కూడా వస్తోంది’ అంటుంది శోభ. హిమ అయిష్టంగానే ఓకే అంటుంది. వెంటనే హిమ ఆలోచనలో పడుతుంది. ‘పార్టీకి స్వప్న అత్తయ్య కూడా వస్తుందా? అంటే బావకి, శోభకి పెళ్లి అంటూ ప్రకటన ఏదైనా చేస్తుంది అని కంగారు పడుతుంది. అదే జరిగితే నేను తెగించాలి.. నాన్నమ్మకి జ్వాలే సౌర్య అనే నిజం చెప్తే అంతా నాన్నమ్మే చూసుకుంటుంది అనుకుంటుంది.ఇక జ్వాలకు కాల్ చేసి పార్టీకి రమ్మని చెబుదాం అనుకుంటుంది.

జ్వాల పిన్ని బాబాయ్ లను బలి పశువులను చేయనున్న శోభ:

ఇక శోభ ఓ రెస్టారెంట్‌లో ఉండి జ్వాల పిన్నీ బాబాయ్‌ల ఫొటోనే చూస్తూ ఉండగా సరిగ్గా అప్పుడే ఇంద్రుడు, చంద్రమ్మలు అదే రెస్టారెంట్‌కి వెళ్లి మేనేజర్‌తో పని కావాలని అడుగుతారు.వాళ్ళని చూసి శోభ వెళ్ళేనా వాళ్ళు అని అనుకుంటుంది. వీళ్లని అడ్డం పెట్టుకుని జ్వాల, నిరుపమ్‌లని విడగొడతాను’ అని శోభ ఫిక్స్ అవుతుంది. మొత్తానికీ రెస్టారెంట్‌లో మేనేజర్‌ రెండు వేలు ఇచ్చి ఓ పార్టీలో వంట చేసే పని అప్పగిస్తాడు.

శోభ. ప్లాన్ వర్కౌట్ అయితే జ్వాల పని అంతేగా :

ఇక శోభ ఈ విషయాన్ని స్వప్నకు చెప్పడంతో నాకు చాలా సంతోషంగా ఉంది శోభా అంటుంది. అలాగే ఈ పార్టీకి జ్వాల వాళ్ల పిన్నీ బాబాయ్‌లు కూడా వచ్చేలా ప్లాన్ చేశాను అంటుంది. నిరుపమ్ పాపం జ్వాల భోజనం తెస్తూ,ఆటో నడుపుతూ కష్టపడే అమ్మాయి అని మంచి అభిప్రాయం ఉంది. ఇప్పుడు నిరుపమ్‌కి జ్వాల బాబాయ్, పిన్నిల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అయిపోతాడు. వాళ్ల స్నేహానికి బ్రేక్స్ పడిపోతాయి అంటూ శోభ తెగ సంబరపడిపోవడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri