NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

IPS AB Venkateshwara Rao: ఏపీ సీఎస్ సమీర్ శర్మకు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మరో లేఖాస్త్రం

IPS AB Venkateshwara Rao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) మరో సారి సీఎం సమీర్ శర్మకు లేఖ రాశారు. ఇంతకు ముందు కూడా ఏబీవీ తన సస్పెన్షన్ ఎత్తివేత, పోస్టింగ్ తదితర అంశాలపై మూడు లేఖలు రాశారు. తాజాగా మరో సారి సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తన సస్పెన్షన్ ఎత్తివేసినప్పటికీ ఇప్పటి వరకూ పోస్టింగ్ ఇవ్వకపోవడంపై ఆయన లేఖలో ప్రస్తావించారు. తక్షణమే తనకు పోస్టింగ్ ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న తన జీతభత్యాలను కూడా విడుదల చేయాలని ఏబీవీ కోరారు.

IPS AB Venkateshwara Rao Letter To AP CS sameer sharma
IPS AB Venkateshwara Rao Letter To AP CS sameer sharma

IPS AB Venkateshwara Rao: కోర్టు ఆదేశాలతో సస్పెన్షన్ ఎత్తివేసినా..

టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించిన ఏబీ వెంకటేశ్వరరావును వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తొలుత తన సస్పెన్షన్ పై ఆయన క్వాట్ ను ఆశ్రయించగా ప్రభుత్వ చర్యను సమర్ధించింది. ఆ తరువాత ఏబీవీ హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆరు నెలల చొప్పున ఆయన సస్పెన్షన్ ను కొనసాగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఏబీవీ మరో సారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రెండేళ్లకు పైబడి ఐపీఎస్ అధికారులను సస్పెన్షన్ లో పెట్టరాదన్న నిబంధనను పురస్కరించుకుని ఏబీవీ సస్పెన్షన్ తక్షణమే రద్దు చేసి, ఆయనను విధుల్లోకి తీసుకోవాలని ఇటీవలే కోర్టు తీర్పు ఇచ్చింది.

2020 ఫిబ్రవరి 8 నుండి సస్పెన్షన్ ఎత్తివేయాలి

సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఏబీ వెంకటేశ్వర రావు పలు మార్లు అమరావతి సచివాలయానికి వెళ్లి సీఎస్ సమీర్ శర్మను కలిసేందుకు ప్రయత్నించారు. సీఎస్ కలిసేందుకు తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఇదివరకే ఏబీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో మూడు లేఖలు రాశారు. ఆ తరువాత ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో జీఏడీలో ఏబీవీ రిపోర్టింగ్ చేశారు. పోస్టింగ్ అంశంతో పాటు ఉత్తర్వుల్లో తప్పులపై ఏబీవీ గురువారం మరో లేఖ రాశారు. 2020 ఫిబ్రవరి 8వ తేదీ నుండి సస్పెన్షన్ ఎత్తివేత వర్తింపజేయాలని న్యాయస్థానం ఆదేశించినా అది అమలు అమలు చేయలేదనీ, 2022 ఫిబ్రవరి 8 నుండి వర్తింపజేస్తూ తప్పుడు జీవో ఇచ్చారని ఏబీవీ పేర్కొన్నారు. ఇప్పటికైనా చట్ట ప్రకారం, పరిపాలన నియమావళి, పద్ధతుల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఏబీవీ కోరారు.

Related posts

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N